బౌధ్ద దేవాలయంలో సింహం: ఫైన్ వేశారు
బీజింగ్: దేవాలయంలో సింహాలను ఉంచారన్న ఆరోపణలతో జరిమానా విధించిన సంఘటన చైనాలో జరిగింది. షాంగ్ఘీ ప్రాంతంలోని ప్రసిద్ది చెందిన ఓ దేవాలమంలో కోన్నేళ్లుగా సింహాన్ని ఉంచుతున్నారని అధికారులకు సమాచారం ఇచ్చారు. శనివారం అధికారులు దేవాలయం దగ్గరకు చేరుకున్నారు.
దేవాలయంలో సింహం ఉన్న విషయం గుర్తించారు. వెంటనే రూ. 30 వేలు జరిమానా విధించారు. అటవి శాఖ అధికారుల సహాయంతో దేవాలయంలో ఉన్న సింహాన్ని జూకు తరలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. 2010లో ఈ బౌధ్ద దేవాలయానికి రెండు సింహాలు అప్పగించారు.

ఓ సింహం అనారోగ్యంతో మరణించింది. రెండో సింహం దేవాలయం ప్రాంగణంలోనే ఉంది. అనుమతి తీసుకోకుండా దేవాలయంలో సింహాన్ని ఎందుకు పెట్టారు అంటూ ఆలయ కమిటీ సభ్యులను అధికారులు నిలదీశారు. ఇక ముందు ఇలా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ విషయంపై విచారణ ప్రారంభించామని, నివేదిక వచ్చిన తరువాత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications