చైనా మరో దుర్మార్గం: మహిళా జర్నలిస్ట్‌కు నాలుగేళ్ల జైలు: లైవ్ టెలికాస్ట్ చేయడమే నేరం
బీజింగ్: చైనా మరో దుర్మార్గానికి పాల్పడింది. ప్రాణాంతక కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియజేసిన ఓ మహిళా సిటిజన్ జర్నలిస్ట్‌ను జైలుపాలు చేసింది. ఈ కేసులో ఆమెకు షాంఘై న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తీర్పు వినిపించింది. కరోనా వైరస్ గురించి ఇప్పటిదాకా ప్రపంచానికి తెలియజేసిన కొంతమంది విజిల్ బ్లోయర్లు, పరిశోధకులు, డాక్టర్లు దేశాన్ని విడిచారు. ఎనిమిది మందిపై చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అదే జాబితాలో తాజాగా మరో జర్నలిస్ట్ చేరారు. జైలుపాలు అయ్యారు.
ఆ మహిళా సిటిజన్ జర్నలిస్ట్ పేరు ఝాంగ్ ఝాన్. వయస్సు 36 సంవత్సరాలు. వృత్తిరీత్యా న్యాయవాది. సిటిజన్ జర్నలిస్ట్‌గా పని చేస్తుంటారు. హ్యూబే ప్రావిన్స్‌లోని వుహాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం దీనిపై ఆమె కథనాలను ప్రసారం చేశారు. లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. విస్తృత కథనాలను అందించారు. అప్పటికి ఆమెకు అది కరోనా వైరస్ అని తెలియదు. గుర్తు తెలియని, పేరు లేని వైరల్ న్యుమోనియాగా ఆమె భావించారట.

వుహాన్‌లో కరోనా వైరస్ అవుట్ బ్రేక్ అయిన వెంటనే ఆమె ప్రసారం చేసిన కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వెళ్లాయని, జనంలో భయాందోళనలు, తీవ్ర కలకలానికి దారి తీశాయనే కారణంతో చైనా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను అస్థిరపరిచేలా, వారిని అల్లకల్లోలానికి గురి చేసేలా ఝాంగ్ ఝాన్ ప్రసారం చేసిన కథనాలు ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. ప్రజల్లో కలకలం పుట్టించడానికి కారణం అయ్యారనే ఉద్దేశంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మేలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
షాంఘైలోని పుడోంగ్ న్యూ డిస్ట్రిక్ట్ పీపుల్స్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కొంతకాలంగా ఈ కేసుపై విచారణ నడుస్తోంది. తాజాగా న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. ఝాంగ్ ఝాన్‌కు నాలుగేళ్ల కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువడించింది. ఈ విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసినందుకు తనపై కఠిన చట్టాలను ప్రయోగించడం సరికాదనేది ఆమె వాదన. విచారణకు హాజరు కావాల్సి ఉన్నందున.. కొద్దిరోజుల కిందట పోలీసులు ఆమె నిరాహార దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఫ్లూయిడ్లను ఎక్కించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications