వాతావరణ మార్పులు: మానవాళికి ముప్పు పొంచి ఉందన్న ఐపీసీసీ నివేదిక

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం వల్ల భవిష్యత్తులో మానవాళి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది.
మనుషులు చేపడుతున్న చర్యలే వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయన్నది వాస్తవం అని ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్) శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
వాతావరణ మార్పులపై ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ - ఐపీసీసీ తన నివేదికను విడుదల చేసింది. వాతావరణ మార్పులపై వచ్చిన అతిపెద్ద సమగ్ర నివేదిక ఇదేనని భావిస్తున్నారు.
ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్‌కు కారణం అవుతున్న ఉద్గారాలు రాబోయే దశాబ్ద కాలంలో ఉష్ణోగ్రత పరిమితులను దాట వచ్చని ఈ నివేదిక పేర్కొంది.
అలాగే ఈ శతాబ్దం చివరినాటికి సముద్ర మట్టంలో పెరుగుదల 2 మీటర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది.
అయితే గ్రీన్హౌస్ ఉద్గారాలలో కనిపిస్తున్న తరుగుదల ఉష్ణోగ్రతలను స్థిరీకరించగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- మోదీ ప్రభుత్వం వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు ఏం చేసింది?
- చేతులు కలిపిన చైనా, అమెరికా.. కాలుష్య నివారణకు కలసి పనిచేస్తామని వెల్లడి

ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ), 'వాతావరణ మార్పులు' అంశంలో వెలువడిన వివిధ అధ్యయనాలను పరిశీలించి ఆ సారాంశాన్ని 42పేజీల అధ్యయన పత్రంగా తీసుకువచ్చింది.
ఐపీసీసీ అనేది వాతావరణ మార్పులపై వచ్చిన శాస్త్రీయ అధ్యయనాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఒక అంతర్జాతీయ సంస్థ.
దీన్ని 1988లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ), వరల్డ్ మెటీరలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) సంయుక్తంగా స్థాపించాయి.
వాతావరణ మార్పుల విషయంపై సత్వర చర్యలు చేపట్టేందుకు ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- వాతావరణ మార్పులు: కర్బన ఉద్గారాల కట్టడికి ఆరు శక్తిమంతమైన మార్గాలు...
- వాతావరణ మార్పుతో పక్షులు కుంచించుకుపోతున్నాయి: అధ్యయనంలో వెల్లడి

ఐపీసీసీ రిపోర్టులోని ప్రధాన అంశాలు
1850-1900 మధ్య కాలంలో కన్నా 2011-2020 మధ్య కాలంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత 1.09C ఎక్కువగా ఉంది.
1850వ సంవత్సరం నుంచి పరిశీలిస్తే గత ఐదేళ్లల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
1901-1971 మధ్య కాలంతో పోల్చిస్తే, ఇటీవల సముద్ర మట్టం పెరుగుదల రేటు దాదాపు మూడు రెట్లు పెరిగింది.
1990ల నుంచి హిమనీనదాలు కరిగిపోవడానికి, ఆర్కిటిక్‌లో మంచు కరిగిపోవడానికి 90% కారణం మానవ తప్పిదాలే.
1950ల నుంచి చూస్తే, ఇటీవల కాలంలో తీవ్రమైన వేడిగాలులు తరచూ వీస్తున్నాయి. మంచు తుఫానుల తాకిడి తగ్గింది. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్నది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
ఇవికూడా చదవండి:
- వాతావరణ మార్పు: రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు గత దశాబ్దంలోనే..
- జమ్మూ: క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, ఇది ఎందుకు అంత ప్రమాదకరం?
- యూరప్ వరదలు: జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌లు అతలాకుతలం
- చమోలీ గ్లేసియర్ : 15 అణుబాంబులు ఒకేసారి పేలినట్లు ఆ రాయి లోయ అడుగును తాకింది
- ఆస్ట్రేలియా: డెంగ్యూ దోమలపై పోరాడే కొత్త రకం దోమల్ని కనుగొన్న పరిశోధకులు
- క్విట్ ఇండియా ఉద్యమం: ఆ ఊళ్లో ఇంటి పేరును ఆజాద్ అని మార్చుకున్నారు
- ఈ మహిళ ప్రపంచాన్ని చుట్టేశారు
- నర మానవుల్లేని 'దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- 'నువ్వు ఆడపిల్లవి, ఈ పని ఎలా చేస్తావు?' అన్నారు... కానీ 4వేల దహన సంస్కారాలు నిర్వహించాను
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications