Lockdown: కరోనాతో విద్యాసంస్థలు క్లోజ్, రీఓపెన్ అయిన ఒక్కరోజులో 79 మంది విద్యార్థులు, పాపం !
న్యూఢిల్లీ/ దక్షిణ కోరియా: ప్రపంచం మొత్తం నేడు కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. భారతదేశంతో పాటు అనేక దేశాలు కరోనా వైరస్ కాటు దెబ్బకు లాక్ డౌన్ అమలు చేశాయి. కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలోనే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. అయితే లాక్ డౌన్ లో సడలింపుల్లో భాగంగా స్కూల్స్ తెరుచుకోవడంతో విద్యార్థులు ఒక్కసారిగా పాఠశాలలకు వెళ్లారు. అంతే ఒక్కరోజులో దాదాపు 250 స్కూల్స్ తెరుచుకున్నాయి. ఈ దెబ్బతో 79 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో హడలిపోయిన ప్రభుత్వం వెంటనే స్కూల్స్ మూసివేశారు.

దక్షిణ కోరియాలో కరోనా కాటు
దక్షిణ కోరియాలో ఇప్పటి వరకు 11, 402 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు 269 మంది మరణించారు. కరోనా వైరస్ తో పోరాటం చేసిన 10, 363 మంది ప్రాణాలతో బయటపడ్డారు. దక్షిణ కోరియాలో ఇంకా 770 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతున్నారు.

లాక్ డౌన్ దెబ్బకు క్లోజ్
దక్షిణ కోరియాలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో ఒక్కసారిగా ఆ దేశంలో లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు కావడంతో దక్షిణ కోరియాలో అన్ని వ్యాపార లావాదేవీలతో పాటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా వైరస్ కంట్రోల్ లోకి వచ్చిందని దక్షిణ కోరియా ప్రభుత్వం భావించింది. దక్షిణ కోరియాలో లాక్ డౌన్ సడలించడంతో పలు వ్యాపారాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

ఒక్కరోజులో తల్లిదండ్రులకు షాక్
లాక్ డౌన్ సడలించడంతో దక్షిణ కోరియాలో దాదాపుగా 250 విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు ఇళ్లకే పరిమితం అయిన విద్యార్థులు దాదాపు 80 శాతం మంది పాఠశాలలకు వెళ్లారు. ఒక్కరోజు పాఠశాలలకు వెళ్లి వచ్చిన విద్యార్థులు చాలా మంది అనారోగ్యానికి గురి కావడంతో విరి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైనారు.
Recommended Video

దెబ్బకు విద్యాసంస్థలు క్లోజ్
వందల మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు 79 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. మిగిలిన విద్యార్థులకు కరోనా వైరస్ వ్యాపించకుండా విద్యాసంస్థలు ఒక్కరోజులోనే అన్ని మూసివేశారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా పొరపాటు చేసి విద్యాసంస్థలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications