మోడీ వెనక్కి తగ్గరు: చైనాకు దడ పుట్టిస్తున్న బీజేపీ గెలుపు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ బలోపేతమవుతుండటం తమకు శ్రేయస్కరం కాదని చైనా భావిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ సాధించిన విజ‌యం, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ గెలుపు చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'గ్లోబల్ టైమ్స్' గురువారం ప్రచురించిన వ్యాసంలో బీజేపీ రోజు రోజుకూ బలపడుతుండటం వల్ల అంతర్జాతీయ అంశాల్లో భారతదేశంతో పరిష్కారాలు కుదరడం మరింత కష్టమవుతుందని పేర్కొంది.

బీజేపీ విజ‌యం త‌మ‌కు ఏమాత్రం మంచిది కాద‌ని అక్క‌డి గ్లోబ‌ల్ టైమ్స్ అభిప్రాయ‌ప‌డింది. ఇక‌ అంత‌ర్జాతీయ వివాదాల్లో ఇండియా అస‌లు వెన‌క్కి త‌గ్గ‌బోద‌ని చైనా టెన్ష‌న్ ప‌డుతోంది. ఈ విజ‌యంతో జాతీయంగా, అంత‌ర్జాతీయంగా మోడీ మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని ఆ ప‌త్రిక పేర్కొంది.

అంతేగాక, 2019లోనూ బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఈ ప‌త్రిక అంచ‌నా వేసింది. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల్లో భార‌త్ వైఖ‌రిలో మోదీ గ‌ణనీయ‌మైన మార్పు తీసుకొచ్చారు. గ‌తంలో భార‌త్ త‌మ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఎవ‌రినీ నిందించేది కాదు. వివాదాల్లో ఒక నిర్ణ‌యం తీసుకొని దానికి క‌ట్టుబ‌డి ఉండేది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీ మ‌ళ్లీ గెలిస్తే.. ఇండియా వ్య‌వ‌హార తీరు మ‌రింత క‌ఠినంగా ఉండ‌నుంది. అదే జ‌రిగితే అంతర్జాతీయ వ్య‌వ‌హారాల్లో భార‌త్ అస‌లు వెన‌క్కి త‌గ్గ‌బోదు అని గ్లోబ‌ల్ టైమ్స్ క‌థ‌నం అభిప్రాయ‌ప‌డింది.

చైనాకు గుబులు

చైనాకు గుబులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో అనుసరిస్తున్న రాజీ లేని ధోరణి వల్ల పరిస్థితులు మరింత కఠినమవుతాయని చైనా తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఇతర మాద్యమాలు చెప్తున్న విషయాన్ని కూడా ఈ వ్యాసంలో ప్రస్తావించారు.

మోడీ మార్చేశారు..

మోడీ మార్చేశారు..

ఇతరులను ఎన్నడూ బాధించేందుకు ప్రయత్నించరాదన్న భారతదేశ గత వైఖరిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్చేశారని గ్లోబల్ టైమ్స్ వ్యాసం పేర్కొంది. ఇతర దేశాలతో వివాదాల పరిష్కారంలో దేశ స్వీయ ప్రయోజనాలను గరిష్ఠ స్థాయిలో రాబట్టుకోవడమే లక్ష్యంగా స్పష్టమైన వైఖరిని మోడీ ప్రద్శిస్తున్నారని తెలిపింది.

మరోసారి గెలిస్తే అంతే..

మరోసారి గెలిస్తే అంతే..

మోడీ తదుపరి ఎన్నికల్లో విజయం సాధిస్తే, భారతదేశం ప్రస్తుతం అనుసరిస్తున్న కఠిన, దృఢ వైఖరి కొనసాగుతుందని పేర్కొంది. ఇతర దేశాలతో వివాదాల్లో పరిష్కారాలు మరింత కష్టమయ్యే అవకాశాలు ఉంటాయని వివరించింది.

మోడీ దృఢ వైఖరికి నిదర్శన

మోడీ దృఢ వైఖరికి నిదర్శన

మోదీ దృఢ వైఖరికి ఉదాహరణగా ఆయన సైన్యంతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడాన్ని ప్రస్తావించింది. భారతదేశంలో జరిగే అతి పెద్ద పండుగను చైనా-భారతదేశ సరిహద్దుల్లో భారతీయ సైనికులతో కలిసి మోడీ జరుపుకున్నారని పేర్కొంది. ఇది మోడీ తన దృఢ వైఖరిని వ్యక్తం చేయడమేనని వివరించింది. సరిహద్దు వివాదంలో కారు చీకట్లో కాంతి రేఖ వంటిదేమీ ఇప్పటికీ కనిపించడం లేదని తెలిపింది

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BJP's landslide victory in state polls has "implications" for the Sino-India ties as it could further embolden Prime Minister Narendra Modi's "hard-line attitude" and pose difficulties for "compromises" in rows with countries like China, official Chinese media commented on Thursday.
Please Wait while comments are loading...