పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆర్మీ వాహనం సమీపంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందారు.
లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆర్మీ వాహనం సమీపంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందారు.
చనిపోయిన వారిలో నలుగురు సైనికులు ఉన్నారు. మరో 14 మంది గాయపడినట్లు పాకిస్తాన్‍లోని పంజాబ్ రాష్ట్ర అధికార ప్రతినిధది మాలిక్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు.

సమాచారం అందుకున్న సహాయక బృంద సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని విస్త్రత తనిఖీలు చేశారు.
ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దాడిపై ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ నుంచి ప్రకటనలు వెలువడలేదు. స్థానికంగా ఉన్న పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.












Click it and Unblock the Notifications