ఎయిర్ ఏషియా: 162మంది సజీవ సమాధి, తేలుతున్న మృతదేహాలు
ఇండోనేషియా: సురబయ - సింగపూర్ విమానం క్యూజెడ్ 8501 విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లుగా ఇండోనేషియా అధికారులు ధృవీకరించారు. 162 మందితో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానాన్ని గుర్తించామని ఇండోనేషియా సివిల్ ఏవియేషన్ అధికారులు మంగళవారం ప్రకటించారు.
ఇండోనేషియాలోని బోర్నియా ద్వీపం సమీపంలో విమానం తలుపులు, స్లైడ్, ఇతర పరికరాలు గుర్తించినట్లుగా పౌర విమానయాన సంస్థ తెలిపింది. బోర్నియా ద్వీపంలో గుర్తించిన వస్తువులు విమాన గాలింపు చర్యల్లో అత్యంత కీలకమైనవిగా అధికారులు చెప్పారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

కాగా, మృతదేహాలు సముద్రంలో తేలియాడుతున్నట్లుగా గుర్తించారు. జావా సముద్రంలో శకలాలు లభ్యమయ్యాయని ఇండోనేషియా ఏవియేషన్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
#QZ8501: '10 big objects spotted', not yet clear if part of missing #AirAsia plane http://t.co/LhFehpIYB0 pic.twitter.com/mwor2ydgm8
— RT (@RT_com) December 30, 2014 ఈ ప్రమాదంలో 155 మంది ప్రయాణీకులు, 7గురు సిబ్బంది మృతి చెందారు. ఈ ప్రయాణీకులలో 149 మంది ఇండోనేషియన్లు, ముగ్గురు కొరియన్లు, సింగపూర్, బ్రిటన్, మలేషియా దేశాలకు చెందిన ఒక్కరు చొప్పున ఉన్నారు. కాగా, మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని ఎయిర్ ఏషియా చీఫ్ చెప్పారు.
#QZ8501: Objects seen in sea resembling life raft, life jackets http://t.co/aLZfxf5b30 #AIRASIA pic.twitter.com/nFgiSUd5YY
— RT (@RT_com) December 30, 2014 











Click it and Unblock the Notifications