వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్‌ బారిన ట్రంప్ చిన్న కొడుకు బారన్ ట్రంప్, వివరాలను వెల్లడించిన మెలానియా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆయన భార్య అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా వచ్చిన కొద్ది రోజులకే కొడుకు బారన్ ట్రంప్‌కు కూడా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా తల్లి మెలానియా ట్రంప్ వెల్లడించారు. వైట్ హౌజ్ అధికారిక వెబ్‌సైట్‌ పై కరోనాతో తాను ఏ విధంగా పోరాడిందో తన అనుభవాలను మెలానియా ట్రంప్ రాసుకొచ్చారు. ఇక రెండు వారాల క్రితం ట్రంప్ దంపతులకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ కాగా.. ఆ సమయంలో కొడుకు బారన్ ట్రంప్‌కు కూడా పరీక్షలు నిర్వహించిన సమయంలో నెగిటివ్‌గా వచ్చింది. అయితే మరోసారి బారన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని మెలానియా ట్రంప్ వివరించారు.

తామిద్దరికి కరోనా పాజిటివ్ సోకడంతో వెంటనే తన కొడుకు వైపే తన దృష్టి మరలిందని మెలానియా చెప్పారు. ముందుగా నెగిటివ్ ఆ తర్వాత పాజిటివ్ రావడం, అయితే లక్షణాలు కనిపించకపోవడంతో మళ్లీ టెస్టులు చేయించగా నెగటివ్ వచ్చినట్లు మెలానియా స్పష్టం చేశారు. ఇక తన 14 ఏళ్ల కొడుకు ఎలా ఉన్నాడని ఎన్నికల ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు ట్రంప్‌ను విలేఖరులు ప్రశ్నించగా... అందుకు బాగానే ఉన్నాడని అతని ఆరోగ్యం కుదుటపడుతోందని సమాధానం ఇచ్చారు. బారన్‌కు కరోనా చాలా తక్కువ సమయం వరకు మాత్రమే ఉన్నిందని ట్రంప్ చెప్పారు. అసలు తనకు కరోనా వచ్చిందన్న విషయం కూడా బారన్‌కు తెలియదని తాననుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. వయస్సులో ఉన్న పిల్లలు కాబట్టి వారిలో నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ట్రంప్ చెప్పారు.

Donald Trump elder son Baraon Trump tests positive for Covid, Melania shares it on Whitehouse website

ఇక మెలానియా ట్రంప్ కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో తన అనుభవాన్ని పంచుకున్నారు. వ్యాధి లక్షణాలు చాలా తక్కువగా తనలో కనిపించాయని అయితే రోజులు గడిచే కొద్ది ఒక్కసారిగా లక్షణాలు స్పష్టంగా కనిపించినట్లు మెలానియా పేర్కొన్నారు. ముందుగా ఒళ్లు నొప్పులు, ఆ తర్వాత దగ్గు, తలనొప్పి, విపరీతమైన అలసట వంటి లక్షణాలు కనిపించాయని వెల్లడించింది.అయితే తన భర్త ట్రంప్‌లా తాను చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లలేదని వివరించిన మెలానియా... వైట్‌హౌజ్ నివాసంలోనే క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇక ట్రంప్ తీసుకున్న చికిత్సను తాను తీసుకోలేదని, వ్యాధి నుంచి విముక్తి పొందేందుకు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు విటమిన్స్‌ను తీసుకున్నట్లు చెప్పారు. గంపగుత్తగా మందులు వాడలేదని మెలానియా స్పష్టం చేశారు.

Recommended Video

India-China Stand Off : లడఖ్ ను భారత్ అక్రమంగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది - China

ఇదిలా ఉంటే అధ్యక్షుడు ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తున్నారు. ఇప్పటికే చాలా సర్వేలు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌కు అనుకూలంగా ఉండగా వాటన్నిటినీ ట్రంప్ కొట్టిపారేశారు. ప్రజలు తిరిగి తనకే పట్టం కడతారన్న విశ్వాసాన్ని ట్రంప్ వ్యక్తం చేస్తున్నారు. కరోనావైరస్‌పై పోరులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారన్న జో బిడెన్ వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లినట్లు సమాచారం. ఇక ట్రంప్‌కు కరోనా రావడంతో కొన్ని రోజులు పాటు ప్రచారానికి దూరమై వెనకబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నారు.

English summary
US First lady Melania Trump reveals that her 14 year old son is tested Positive for Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X