Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Donald Trump: మరో బాంబుపేల్చిన ట్రంప్.. భారత్-పాక్ సీజ్ ఫైర్ వెనుక?

భారత్-పాకిస్తాన్ (india Pakistan)మధ్య ఆపరేషన్ సింధూర్ వార్ జరుగుతున్నప్పుడు మధ్యలో తలదూర్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) కాల్పుల విరమణకు ఇరుదేశాల్ని తానే ఒప్పించినట్లు చెప్పుకున్నారు. అయితే ఆ వాదనను తోసిపుచ్చిన భారత్.. పాకిస్తాన్ అడిగితేనే నేరుగా తామే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు పలుమార్లు చెప్పుకుంది. అయితే ఆ తర్వాత కూడా భారత్-పాక్ వార్ ఆపింది తానేనంటూ చెబుతూ వస్తున్న ట్రంప్.. ఇవాళ మరింత డోస్ పెంచి ఇంకో బాంబు పేల్చారు.

గతేడాది భారత్-పాక్ మధ్య సాగిన వార్ ను తానే మధ్యవర్తిత్వం వహించి ఆపానని ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య యుద్దాన్ని తాను 200 శాతం సుంకాల బెదిరింపుతో ఆపినట్లు వెల్లడించారు. అలాగే ఈ వార్ లో 11 యుద్ద విమానాలు నేలకూలినట్లు మరోసారి వెల్లడించారు. అమెరికాలో జరుగుతున్న గాజా శాంతి బోర్డు సమావేశంలో ట్రంప్ ఈ విషయాలు బయటపెట్టారు. అయితే ఈ అంశాల్ని భారత్ ఎప్పటి నుంచో ఖండిస్తూనే ఉంది. అయినా ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు.

Donald Trump s 200 Tariff Boast 11 Jets Claim Inflating India-Pak Ceasefire Role

తమ త్రివిధ దళాధిపతి ముందు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ.. ట్రంప్ మనకు, భారత్ కూ మధ్య యుద్ధాన్ని ఆపి 25 మిలియన్ల ప్రాణాలను కాపాడారని చెప్పారని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. ఆ యుద్ధం ఉధృతంగా సాగుతోందని, విమానాలు కూలిపోతున్నాయని, తాను వారిద్దరికీ ఫోన్ చేసానని, వినండి, మీరు దీన్ని పరిష్కరించుకోకపోతే నేను మీ ఇద్దరితో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం లేదని చెప్పేశానన్నారు. దీంతో వారు వెనక్కి తగ్గారన్నారు. ఈ సందర్భంగా భారత్-పాక్ లకు ట్రంప్ మరోసారి థ్యాంక్స్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+