తెలుగు విద్యార్ధులకు ట్రంప్ బిగ్ షాక్-భారత్ లో సగం వీరివే..!

అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వలసదారులతో పాటు కొత్తగా వీసాలు తీసుకునే విధానాన్ని కూడా కఠినంగా మార్చేశారు. దీంతో ఇప్పటికే వివిధ దేశాల నుంచి అమెరికాకు విద్యార్థి వీసాల కోసం వచ్చిన దరఖాస్తుల్ని భారీ సంఖ్యలో తిరస్కరించారు. ఇలా భారత్ నుంచి వచ్చిన విద్యార్థి వీసా దరఖాస్తుల్లో తిరస్కరించిన వాటిలో సగం తెలుగు రాష్ట్రాల విద్యార్దులవే ఉన్నట్లు తాజాగా తేలింది.

అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్ధులు అక్కడ నివాసం ఉండేందుకు కాకుండా కేవలం చదువుకుని తిరిగి వెళ్లిపోయేందుకు వీలుగా ఎఫ్1 వీసా జారీ చేస్తుంటారు. వీటి కోసం భారత్ నుంచి ప్రతీ ఏటా భారీగా విద్యార్ధులు దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే ఈ ఏడాది భారత్ నుంచి వచ్చిన 41 శాతం వీసా దరఖాస్తుల్ని అమెరికా తిరస్కరించింది. అలాగే వీటికి గల కారణాలను కూడా చెప్పలేదు. దీంతో ఆయా విద్యార్ధులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా తిరస్కరించిన వీసాల్లో సగం తెలుగు రాష్ట్రాలవే ఉన్నట్లు తాజాగా కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి.

Donald trump s big shocker to telugu students half of the Indian visas rejections from two states

అయితే ఇలా విద్యార్ధి వీసా దరఖాస్తుల తీరస్కరణ వెనుక ఓ కీలక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్ధులు భారీ సంఖ్యలో అక్కడే ఉండిపోయారు. ట్రంప్ వలస విధానం కఠినతరం చేసిన తర్వాత అక్కడ తనిఖీలు కూడా పెరిగాయి. దీంతో విద్యార్ధులు తనిఖీలకు దొరక్కండా అక్కడే ఉండిపోతున్నారు. దీంతో కొత్తగా విద్యార్ధి వీసా దరఖాస్తుల్ని అమెరికా అధికారులు స్వీకరించడం లేదని తెలుస్తోంది. మరికొంతకాలం ఆగితే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+