వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజిత్‌ధోవల్ టూర్‌తో సరిహద్దు సమస్య పరిష్కారం కాదు: చైనా

భాతర జాతీయ రక్షణ సలహదారు అజిత్‌ధోవల్ చైనా పర్యటించిన మాత్రానా రెండు దేశాల మద్య నెలకొన్న సరిహద్దు సమస్య తీరుతోందని భావించడం లేదని చైనా మీడియా ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భాతర జాతీయ రక్షణ సలహదారు అజిత్‌ధోవల్ చైనా పర్యటించిన మాత్రానా రెండు దేశాల మద్య నెలకొన్న సరిహద్దు సమస్య తీరుతోందని భావించడం లేదని చైనా మీడియా ప్రకటించింది. ఈ మేరకు గ్లోబల్‌టైమ్స్‌లో తాజాగా ఓ కథనం ప్రచురితమైంది.

బ్రిక్స్ దేశాల సమావేశానికి ఈ నెల 27, 28 తేదిల్లో అజిత్‌ధోవల్ చైనా వెళ్ళనున్నారు. అయితే రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు నెలకొన్నాయి. ఈ సమస్యల నేపథ్యంలో అజిత్‌ధోవల్ చైనా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది.

 Doval's Visit Will Not Lead to a Bilateral on Border Issues, Says Chinese Daily

రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యపై ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దరిమిలా ప్రతిరోజూ చైనా మీడియా ఏదోరకంగా ఇండియాపై విషం కక్కుతూనే ఉంది.

ప్రస్తుతం చైనా, భారత్‌ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నవారిలో ధోవల్ ఒకరు. అయితే ఆయన చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ వివాదానికి తెరపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అయితే ఈ తరుణంలో చైనా మీడియాలో ప్రచురితమైన కథనాలు మరోసారి కలకలాన్ని రేపుతున్నాయి. ఇరు దేశాల మధ్య సాగుతున్న సరిహద్దు వివాదానికి న్యూఢిల్లీ స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని గ్లోబల్‌టైమ్స్ ప్రకటించింది.

బీజింగ్‌లో జరగనున్న ధోవల్ పర్యటన తమ దేశంతో ఉన్న సరిహద్దు వివాదానికి పరిష్కారం ఇస్తోందని మాత్రం భావించొద్దని ఆ పత్రిక ప్రకటించింది. బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రతి ఏటా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సమావేశం జరగడం అనేది సాధారణమైన విషయం. ఇది చైనా, భారత్ మధ్యసమస్యల పరిష్కారానికి వేదిక కాదంటూ చైనా మీడియా ప్రకటించింది.

English summary
National Security Advisor Ajit Doval’s visit to China for the BRICS Summit will not result in a bilateral meeting to resolve the current standoff between the two countries in Doklam, a Chinese media report said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X