యుద్ధంలోనూ కొత్త శకం.. డ్రోన్లతో వార్, పశ్చిమాసియాలో 10వేల అమెరికా మెరోప్స్ డ్రోన్లు!
పశ్చిమాసియాలో వార్ కొనసాగుతుంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ తమ దాడులను రోజురోజుకు తీవ్రతరం చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులకు పాల్పడుతోంది. ఈ యుద్ధంలో డ్రోన్ లు, క్షిపణులను విస్తృతంగా వాడుతూ దాడులను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధం హోరాహోరీగా కొనసాగుతుంది.
పశ్చిమాసియాలో పదివేల డ్రోన్లు
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ తమ దాడులు కొనసాగిస్తున్న క్రమంలో శత్రు డ్రోన్లను వేటాడి నాశనం చేసే కృత్రిమ మేధ ఆధారిత మెరోప్స్ ఇంటర్ సెప్టర్ డ్రోన్ లను దీని కోసం వినియోగిస్తున్నారు. బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా పశ్చిమాసియాలో పదివేల డ్రోన్లను మోహరించింది.

మెరోప్స్ ఇంటర్ సెప్టర్లు సమర్థవంతంగా కూల్చివేసిన రక్షణ శాఖ
ప్రాజెక్టు ఈగల్ కింద google మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ సారధ్యంలోని ఓ రక్షణ సంస్థ మెరోప్స్ డ్రోన్ లను అభివృద్ధి చేసింది. వీటిని 2024లో ఉక్రెయిన్ యుద్ధంలో విస్తృతంగా ఉపయోగించారు. రష్యా ఇరాన్ షాహెద్ డ్రోన్లను ఉపయోగిస్తే, వాటిని మెరోప్స్ ఇంటర్ సెప్టర్లు సమర్థవంతంగా కూల్చి వేసినట్టు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇరాన్ షాహెద్ డ్రోన్లను ఉపయోగిస్తోంది.
ఇరాన్ షాహెద్ డ్రోన్లు, అమెరికా మెరోప్స్ డ్రోన్స్
వాటిని ప్రతిఘటించడం కోసం అమెరికా పెద్ద సంఖ్యలో మెరోప్స్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇరాన్ షాహెద్ డ్రోన్ తయారీకి సుమారు 20వేల డాలర్లు ఖర్చు అవుతుంటే, మెరోప్స్ ఇంటర్ సెప్టర్ డ్రోన్ ఒక్కొక్కదానికి దాదాపు 14వేల డాలర్ల నుండి 15వేల డాలర్ల వరకు ఖర్చవుతుందని చెప్తున్నారు. అయితే వీటిని పెద్ద మొత్తంలో కొంటే ఒక్కొక్కటి 3వేల డాలర్ల నుండి 5వేల డాలర్ల మధ్య లభిస్తుందని రక్షణ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.
పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన పదివేల డ్రోన్లు మోహరింపు
ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధంలో డ్రోన్లు, క్షిపణులు కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఖర్గ్ ఐలాండ్ పై దాడి విషయంలో ఇరాన్ అమెరికాకు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చింది. మొత్తంగా యుద్ధంలో పదివేల డ్రోన్లను పశ్చిమాసియాలో అమెరికా మోహరించి యుద్ధం చేయడం ప్రధానంగా గుర్తించవలసిన అంశం.
-
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ఇరాన్ కు కొత్త భద్రతా ఛీఫ్-లారిజానీ స్ధానంలో-ఎవరీ మహమ్మద్ జోల్ఘదర్? -
తాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్ -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ?











Click it and Unblock the Notifications