అఫ్గానిస్తాన్ లో భారీ భూకంపం.. దద్దరిల్లిన దిల్లీ, కాశ్మీర్..

వెనిజులాలో భూకంపం మరువకముందే మరో షాకింగ్ ఘటన జరిగింది. అఫ్గానిస్తాన్‌ లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. దాంతో భారత్, పాకిస్థాన్ సహా పలు పొరుగు దేశాలను వణికించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో జమ్మూ కాశ్మీర్, దిల్లీ-ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాలలో బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శనివారం రాత్రి అకస్మాత్తుగా భూమి కంపించడంతో ఇళ్లలోని వస్తువులు కదిలిపోయాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు తమ నివాసాల నుంచి దిక్కుతోచని స్థితిలో రోడ్లపైకి పరుగులు తీశారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వివరాల ప్రకారం, శనివారం రాత్రి 7.04 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. ఈశాన్య అఫ్గానిస్తాన్‌లోని జుర్మ్ పట్టణానికి దక్షిణంగా 43 కిలోమీటర్ల దూరంలో, భూమి లోపల సుమారు 215 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రాన్ని గుర్తించారు. అఫ్గాన్ రాజధాని కాబూల్‌తో పాటు బల్ఖ్, బాధాక్షాన్ ప్రావిన్సుల్లో అనేక నివాస గృహాల గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే తక్షణ ప్రాణ నష్టం జరిగినట్లు ఎక్కడా వార్తలు రాలేదు.

భూకంపాలకు నిలయంగా హిందూకుష్

యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనే హిందూకుష్ పర్వత శ్రేణుల పరిధిలో అఫ్గానిస్తాన్ విస్తరించి ఉంది. అందుకే ఈ సున్నితమైన భౌగోళిక ప్రాంతంలో తరచుగా తీవ్రమైన భూప్రకంపనలు సంభవిస్తుంటాయి. గతంలో సంభవించిన భారీ భూకంపాల వల్ల ఇక్కడ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి తాజా ప్రకృతి విపత్తు వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు స్థానిక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

బలూచిస్తాన్‌ లో వరుసగా ఐదు సార్లు ప్రకంపనలు

కాగా, సరిహద్దు దేశమైన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌ కూడా కొన్ని రోజులుగా వరుస భూప్రకంపనలతో అతలాకుతలమవుతోంది. శుక్రవారం నుంచి బార్కాన్, తదితర సరిహద్దు ప్రాంతాలలో ఏకంగా ఐదుసార్లు భూమి కంపించడం గమనార్హం. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 4.3 నుండి 5.3 వరకు నమోదైంది. ఈ నిరంతర భూ ప్రకంపనల కారణంగా ఐదుగురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని బలహీనమైన నివాస గృహాలు కూడా దెబ్బతిన్నట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

Earthquake Hits Afghanistan Strong Tremors Felt In India Pakistan Balochistan Rattled By 5 Quakes

ఈ భౌగోళిక మార్పులపై పాకిస్తాన్ వాతావరణ శాఖ చీఫ్ మెటరాలజిస్ట్ అమీర్ హైదర్ లెఘారీ మాట్లాడుతూ, ఇటీవల వెనిజులా దేశంలో సంభవించిన భారీ జంట భూకంపాల వల్ల భూగర్భంలో విపరీతమైన శక్తి విడుదలవుతుందని పేర్కొన్నారు. బలూచిస్తాన్ ప్రాంతం ఒక ప్రధాన ఫాల్ట్ లైన్‌పై ఉండటం వల్ల ఆ శక్తి ఇతర ఫాల్ట్ లైన్లకు బదిలీ అయి ఈ ప్రకంపనలు సంభవిస్తున్నాయని విశ్లేషించారు. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి ప్రకంపనలు వచ్చే సూచనలు ఉన్నందున సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+