జపాన్‌ను వణికించిన భూకంపం: భయం గుప్పిట్లో జనం, 36 వేల ఇళ్లకు కరెంట్ కట్, రాకాసి అలలు
టోక్యో: జపాన్ దేశంలో వరుస భూకంపాలు అక్కడి ప్రజలను భయకంపితులను చేశాయి. నూతన సంవత్సరం రోజు సంభవించిన భూకంపాలతో ఆ దేశ జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నివాసాల ప్రాంతాల నుంచి బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానిక కాలమాన ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత కంటే అధిక స్థాయిలో ఏకంగా 21 భూకంపాలు సంభవించాయి. అంకుముందు 7.5 తీవ్రతో పశ్చిమ జపాన్‌లో భూకంపం సంభవించింది.
దీంతో ఇషికావా ద్వీకల్పంలో వాజిమా పోర్టులో 4.21 గంటల సమయంలో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో సునామీ అలలను గుర్తించారు. వాజిమాలో చాలా వీధులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్న చోట్ల రహదారులపై భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల సునామీ అలలు అత్యధికంగా ఐదు మీటర్ల ఎత్తు వరకు రావచ్చని హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 36 వేల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో భూకంపం కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి.

హోక్కాయిడో నుంచి నాగసాకి వరకు సునామీ ముప్పు ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రధాన హైవేలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇషికావాలోని ప్రధాన అణువిద్యుత్ కేంద్రం మాత్రం ఇప్పటి వరకు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత భూకంపంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ప్రాణ నష్టంపై సమాచారం లేదు.
Video: The moment mega 7.6 magnitude #earthquake left #Japan shaking pic.twitter.com/RFjPuIlhkx
— Madhuri Adnal (@madhuriadnal) January 1, 2024
తాజాగా, వచ్చిన భూకంపం 1983లో వచ్చిన సీఆఫ్ జపాన్ భూకంపంతో పోలివుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పట్లో ఈ భూకంపంలో 104 మంది పౌరులు ప్రాణాలుకోల్పోయారు. 324 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గత ఏడాది మే నెలలో జపాన్‌లో దాదాపు రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పట్లో 13 మంది గాయపడగా ఒకరు మృతి చెందారు. అప్పుడు కూడా భూకంప కేంద్రం ఇషికావా ప్రాంతంలోనే ఉంది.
#Japan Earthquake/Tsunami. More footage taken today (most footage being shared is from 2011). pic.twitter.com/8tpB33ZMiH
— SacredEuropa ™ (@SacredEuropa) January 1, 2024
రష్యా, ఉత్తరకొరియాలోనూ భూ ప్రకంపనలు, సునామీ హెచ్చరిక
మరోవైపు, రష్యా, ఉత్తరకొరియాలోని పలు ప్రాంతాల్లోనూ సోమవారం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను అధికారులు విడుదల చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications