మరోసారి వణికిస్తున్న ఎబోలా, కాంగోలో 17 మంది మృతి
కాంగో: అత్యంత ప్రమాదకర ఎబోలా వైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. డెమోక్రటికి రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా కారణంగా 17 మంది మృతి చెందారు. ఎబోలా వల్ల పలువురు మృతి చెందారని, ఈ వైరస్ వ్యాప్తిస్తోందని, అందుకే అత్యయిక ఆరోగ్య స్థితి ప్రకటించామని ఆ దేశం ప్రకటించింది.
వైరస్ వ్యాప్తి నియంత్రణకు సిబ్బందిని రంగంలోకి దించారు. బికోరో పట్టణం సమీపంలోని ఓ గ్రామంలో వ్యాధి లక్షణాలతో 21 మంది ఆసుపత్రిలో చేరగా అందులో 17 మంది చనిపోయారు. ఆఫ్రికాలో ఎబోలా బయటపడటం ఇది తొమ్మిదోసారి. 1970లో దీనిని మొదటిసారి గుర్తించారు.

రెండేళ్ల క్రితం పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాపించి ప్రపంచాన్ని భయపెట్టింది. గునియా, సియర్రా, లియోన్, లైబీరియా సహా పలు దేశాల్లో కలిపి 11,300 మంది చనిపోయారు. దాదాపు 28,600మందికి ఈ వైరస్ సోకడంతో చికిత్స పొందారు.












Click it and Unblock the Notifications