రూ.900 కోట్ల విలువైన షేర్లను విరాళంగా.. ఎలాన్ మస్క్ మైండ్ గేమ్?

ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి తన నిర్ణయంతో అందరిని ఆలోచించేలా చేశాడు. 2025 ఏడాది ముగింపు వేళ సుమారు 100 మిలియన్ డాలర్లు (దాదాపు ₹900 కోట్లు) విలువైన టెస్లా షేర్లను విరాళంగా ప్రకటించారు. బయటికి చూస్తే ఇది గొప్ప దాతృత్వ చర్యలా కనిపిస్తున్నా, ఆర్థిక నిపుణులు మాత్రం దీని వెనుక ఉన్న ట్యాక్స్ ప్లానింగ్, వ్యూహాత్మక లెక్కలపై దృష్టి సారిస్తున్నారు. మరి ఎలాన్ మస్క్ చేసిన విరాళం వెనకున్న కోణాలు ఏంటి? సోషల్ మీడియాలో ఏం చర్చ నడుస్తుంది?

ఎలాన్ మస్క్ ప్రత్యేకత ఏమిటంటే... ఆయన ఎప్పుడూ కూడా నగదు విరాళాలు ఇవ్వరు. ఈసారి కూడా టెస్లా షేర్లనే దానం చేశారు. అమెరికా పన్ను చట్టాల ప్రకారం, షేర్లను నేరుగా దాతృత్వ సంస్థలకు బదిలీ చేస్తే, వాటిపై వచ్చే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పూర్తిగా తప్పుతుంది. అంతేకాదు, ఆ షేర్ల మార్కెట్ విలువ మొత్తాన్ని పన్ను మినహాయింపుగా చూపించే అవకాశం ఉంటుంది. అంటే, నగదుగా ఇవ్వడానికంటే షేర్ల రూపంలో దానం చేయడం బిలియనీర్లకు అత్యంత ప్రయోజనకరమైన మార్గం. కాబట్టి ఎలాన్ మస్క్ కూడా 100 మిలియన్ డాలర్లు విలువైన టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చేశారు అని విమర్శించుకుంటున్నారు నెటిజన్లు.

కేవలం 0.015 శాతం మాత్రమే..

ఇక్కడే అసలు లెక్క దాగుంది. మస్క్ నికర ఆస్తి ప్రస్తుతం 650 బిలియన్ డాలర్లకు పైమాటే. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన 100 మిలియన్ డాలర్లు ఆయన మొత్తం సంపదలో కేవలం 0.015 శాతం మాత్రమే. ఆర్థికంగా ఇది ఎంత చిన్న మొత్తమంటే, ఒక మధ్యతరగతి వ్యక్తి తన జీవిత సంపాదనలో నుంచి వంద రూపాయలు దానం చేసినంత. అందుకే సోషల్ మీడియాలో "ఇది గొప్ప దాతృత్వం కంటే, స్మార్ట్ అకౌంటింగ్" అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Elon Musk Donates 100 Million Dollars Worth of Tesla Shares Raising Questions Over Tax Strategy

ఇయర్ఎం డ్ ట్యాక్స్ మేనేజ్‌మెంట్?

అయితే మస్క్ ఇలా చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇదే పద్ధతిని అనుసరించారు. 2021లో 5.7 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు, 2022లో 1.95 బిలియన్ డాలర్లు, 2024లో 112 మిలియన్ డాలర్లు, ఇప్పుడు 2025లో 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రతి సారి కూడా సంవత్సరాంతంలోనే ఈ విరాళాలు ప్రకటించడం గమనార్హం. ఇది స్పష్టంగా ఇయర్-ఎండ్ ట్యాక్స్ మేనేజ్‌మెంట్ సంకేతమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

ఇమేజ్, బ్రాండ్ బిల్డింగ్ వ్యూహం..

మరో కోణంలో చూస్తే, ఈ విరాళాల వల్ల దాతృత్వ సంస్థలకు వాస్తవంగా లాభం చేకూరుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తంది. ఎందుకంటే మస్క్ తన సంపదను నగదుగా మార్చకుండా, షేర్ల రూపంలోనే నిల్వ ఉంచుకుంటూ, పన్ను భారం తగ్గించుకుంటున్నారు. అంతేకాదు, పెద్ద మొత్తంలో షేర్లు విక్రయిస్తే మార్కెట్‌పై పడే ప్రభావం కూడా ఈ విధానంతో తప్పుతుంది. అంటే, ఇది కేవలం దాతృత్వం కాదు... మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడటం, పన్ను ఆదా చేసుకోవడం, ఇమేజ్ బిల్డింగ్ చేసుకోవడానికి చేసిన వ్యూహంగా కూడా చెప్పుకొవచ్చు.

భిన్నాభిప్రాయాలు..

ఒక వర్గం మస్క్ ను "దాతృత్వం చేసే వ్యాపారవేత్త"గా చూస్తే, మరొక వర్గం "దాతృత్వాన్ని కూడా వ్యాపార వ్యూహంగా మార్చిన బిలియనీర్"గా అభివర్ణిస్తోంది. నిజం ఏంటంటే... మస్క్ విరాళాలు సమాజానికి మేలు చేస్తూనే, ఆయనకు ఆర్థికంగా అత్యంత ప్రయోజనం కలిగించేలా ప్లాన్ చేసిన చర్యలే. మొత్తానికి, ఎలాన్ మస్క్ చేసిన 100 మిలియన్ డాలర్లు షేర్ల విరాళం గొప్ప సంఖ్యలా కనిపించినా, దాని వెనుక ఉన్న లెక్కలు చూస్తే ఇది భావోద్వేగంతో చేసిన దానం కంటే, లాజిక్‌తో చేసిన నిర్ణయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాతృత్వం, వ్యాపారం, పన్ను ప్రణాళిక - ఈ మూడింటిని ఒకే సారి బ్యాలెన్స్ చేసిన మస్క్ స్టైల్‌కు ఎవరైనా వాట్ ఎన్ ఐడియా సర్ జీ అనాల్సిందే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+