Twitter : మీ ట్విట్టర్ అకౌంట్ వాడటం లేదా ? ప్రక్షాళనకు ఎలాన్ మస్క్ హెచ్చరిక..
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత పలు మార్పులు చేస్తున్న సీఈవో ఎలాన్ మస్క్ ఇప్పుడు మరో భారీ మార్పు చేయబోతున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ ను క్రియాశీల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా మార్చే ప్రయత్నాల్లో ఉన్న మస్క్.. ఈ దిశగా భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు మస్క్ ప్రకటన ఆ యూజర్లకు షాకిచ్చింది.
ట్విట్టర్ లో ఖాతాలు క్రియేట్ చేసుకుని, వాటిని వాడకుండా ఏళ్ల తరబడి వదిలేసిన వారికి ఎలాన్ మస్క్ షాకిచ్చారు. అలాంటి ఖాతాల్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నట్లు మస్క్ కీలక ప్రకటన చేశారు. సుదీర్ఘకాలం యాక్టివ్ గా లేని ట్విట్టర్ హ్యాండిల్స్ తో పాటు అకౌంట్లను త్వరలో ప్రక్షాళన చేస్తామని మస్క్ హెచ్చరించారు. దీని వల్ల ట్విట్టర్ లో ఫాలోయర్స్ సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

మరోవైపు సుదీర్ఘకాలంగా ట్విట్టర్ లో ఉన్న ఖాతాల్ని ప్రక్షాళన పేరుతో తొలగిస్తే అది అది ఫ్రాంగ్మెంటేషన్ కు దారి తీస్తుందంటూ పలువురు యూజర్లు మస్క్ కు ట్వీట్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన మస్క్.. వాటిని ఆర్కైవ్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ట్విట్టర్ లో క్రియాశీలకంగా లేని ఖాతాల ప్రక్షాళన తప్పదన్న సంకేతం ఇచ్చేశారు. ఈ ప్రక్రియ ఎప్పుడు కచ్చితంగా ప్రారంభమవుతుందన్న విషయం చెప్పకపోయినా త్వరలోనే ఇది ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది.
గత వారం మస్క్ న్యూస్ అవుట్‌లెట్ NPRకి ఓ ఈ-మెయిల్ పంపారు. మళ్లీ ట్వీట్ చేయడం ప్రారంభించకపోతే దాని ట్విట్టర్ హ్యాండిల్‌ను కోల్పోతారని కంపెనీని హెచ్చరించారు. యూఎస్ కు చెందిన ఈ వార్తా సంస్థ ఏప్రిల్‌లో ప్రభుత్వ నిధులతో అని లేబుల్ చేసిన తర్వాత ట్విట్టర్‌లో తన ట్వీట్లను పాజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుండి సదరు ఖాతా లేబుల్ తీసేశారు. ఇలాగే మిగతా ఖాతాలకూ మెయిల్స్ పంపి ఆ తర్వాత వాటిని తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications