ఆయన ఎక్కువ రోజు పదవిలో ఉండడు- ఇది నా శాసనం: ఎంత దూరమైనా వెళ్తా
అమెరికా అద్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. కిందటేడాది జనవరి 20వ తేదీన ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్ లో ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారాయన. సుదీర్ఘంగా మాట్లాడారు. దాదాపుగా అన్ని అంశాలనూ ప్రస్తావించారు. కొన్ని దేశాలకు హెచ్చరికలనూ జారీ చేశారు. మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదవుతాయనే సంకేతాలను పంపించారు.
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న తన ప్రయత్నాలను అడ్డుకుంటోన్న కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలను హెచ్చరించారు ట్రంప్. బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరడానికి నిరాకరిస్తోన్న ఫ్రాన్స్ పై ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇక ఎంతోకాలం అధికారంలో ఉండబోడని తేల్చి చెప్పారు. జీ2 అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని మాక్రాన్ పిలుపునివ్వడాన్ని తప్పుపట్టారు. ఆ అవసరం లేదని అన్నారు.

జీ7 భేటీ ఏర్పాటైనప్పటికీ తాను హాజరుకాబోనని స్పష్టం చేశారు. మాక్రాన్ రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితిని ప్రశ్నించారీ సందర్భంగా. ఇమ్మాన్యుయేల్ ఎక్కువ కాలం అధ్యక్షుడిగా ఉండబోడని వ్యాఖ్యానించారు. సిరియాపై ఏకాభిప్రాయం, ఇరాన్‌పై సహకారాన్ని మాక్రాన్ ప్రస్తావించినప్పటికీ.. గ్రీన్‌లాండ్‌పై మాత్రం తన వైఖరి ఏమాత్రం మారబోదని, దీనిపై ఆయన మాట్లాడటంలో అర్థం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తానని, మున్ముందు మీకే తెలుస్తుందని విలేకరులను ఉద్దేశించి చెప్పారు ట్రంప్. ఎటువంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించారు. క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. అటు నాటో, ఐక్యరాజ్యసమితి పైనా నిప్పులు చెరిగారు. తమ పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నాటో సామర్థ్యాలపై సందేహాలు లేవనెత్తారు. నాటో కోసం తానేంతో చేశానని, భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేశామని, అవసరం అయినప్పుడు తమకు అండగా నిలవట్లేదని తప్పుపట్టారు.
ఐరాస అసమర్థత కారణంగానే మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని, వీటిని నివారించడానికే 20 అంశాలతో కూడిన శాంతి ప్రణాళికను ప్రతిపాదించానని ట్రంప్ పేర్కొన్నారు. దీన్ని గాజాలో అమలు చేయడానికి బోర్డ్ ఆఫ్ పీస్ ను ఏర్పాటు చేయాలని తాను నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. శాంతి పునరుద్ధరణకు ఐరాస మరింత కృషి చేయాలని కోరుకుంటోన్నట్లు చెప్పారు. బోర్డ్ ఆఫ్ పీస్ అవసరం లేకుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.
నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడం పట్ల ట్రంప్ మాట్లాడారు. ఇది వెలితిగా ఉందని వ్యాఖ్యానించారు. 10 నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపేశానని పునరుద్ఘాటించారు. కంబోడియా-థాయ్‌లాండ్, కొసావో-సెర్బియా, కాంగో-రువాండాల మధ్య సంవత్సరాలుగా సాగిన ఘర్షణలు వాటిలో ఉన్నాయని ఉటంకించారు. పాకిస్తాన్-భారత్ యుద్ధంలో ఎనిమిది విమానాలను కూల్చివేశారనీ, ఈ రెండు దేశాలు అణుయుద్ధం అంచున నిలిచాయని అన్నారు. ఒక్కో యుద్ధాన్ని ఆపినందుకు ఒక్కో నోబెల్ బహుమతి లభించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
-
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications