Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ కు బంగ్లాదేశ్ గుడ్ న్యూస్..! డార్క్ ప్రిన్స్ రీఎంట్రీ-హసీనాకు చెక్..!

బంగ్లాదేశ్ లో ఉద్యోగాలు, రిజర్వేషన్ల పేరుతో మొదలైన ఆందోళనలు కాస్తా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసే వరకూ వెళ్లడంతో ఈ ఏడాది మొదలైన సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు వచ్చే ఏడాది ఎలాగైనా అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు తాత్కాలిక ప్రభుత్వ సారధి(సలహాదారు) మొహమ్మద్ యూనుస్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కల్పించేందుకు అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

షేక్ హసీనా భారత్ కు పారిపోయి వచ్చి ఆశ్రయం తీసుకోవడం, ఆ తర్వాత ఆమెకు అక్కడి కోర్టులు మరణశిక్ష విధించడం, ఆమె పార్టీ అవామీ లీగ్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పాల్గొని అధికారం చేజిక్కించుకునేందుకు హసీనా చిరకాల ప్రత్యర్ది, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఖలీదా జియా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో ఒకప్పుడు హసీనా దెబ్బకు అజ్ఢాతంలోకి వెళ్లిపోయిన ఖలీదా జియా కుమారుడు, డార్క్ ప్రిన్స్ గా పేరున్న తారిఖ్ రెహ్మాన్ రీఎంట్రీ ఇచ్చారు.

Exiled Tarique Rahman Returns to Bangladesh Here s Why New Delhi is Cheering

స్వదేశంలో పరిస్ధితులు అంతకంతకూ దిగజారుతుండటం, తమ రాజకీయ ప్రత్యర్థి షేక్ హసీనా పార్టీని నిషేధించడం, ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతుండటం వంటి అనుకూల పరిస్ధితుల మధ్య రెండు దశాబ్దాల తర్వాత తారిఖ్ రీఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకూ ఓ ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తు అన్నట్లుగా బంగ్లా రాజకీయం మారిపోతోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి అధికారం చేపడుతుందన్న అంచనాలున్న బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ)కి తారిఖ్ సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exiled Tarique Rahman Returns to Bangladesh Here s Why New Delhi is Cheering

మరోవైపు తమకు ఇన్నాళ్లూ అనుకూలంగా ఉంటూ వచ్చిన షేక్ హసీనా పదవి కోల్పోగానే ఆమెకు ఆశ్రయం కల్పించిన భారత్ కు ఇప్పుడు ఆమె ప్రత్యర్థి పార్టీ బీఎన్పీకి చెందిన తారిఖ్ రెహ్మాన్ రీఎంట్రీ ఇవ్వడం ఆలోచనలో పడేస్తోంది. ఇప్పుడు హసీనాకు ఆశ్రయం కొనసాగించాలా లేక తారిఖ్ రెహ్మాన్ కు మద్దతునివ్వాలా అనే అంశంపై భారత్ మల్లగుల్లాలు పడుతోంది. అయితే తారిఖ్ రెహ్మాన్ రేపు అధికారం చేపట్టినా భారత్ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న అరాచక పరిస్ధితులతో పోలిస్తే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేత తారిఖ్ రెహ్మాన్ పొరుగుదేశంతో సానుకూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.అలాగే హసీనా పార్టీ అవామీలీగ్ నేతలు కూడా ఇప్పుడు ఆయన పార్టీలో చేరిపోతున్నారు. బీఎన్పీకి పోటీగా ఉన్న యువకుల నేషనల్ సిటిజన్ పార్టీ కంటే బీఎన్పీయే బెటర్ అని ఇండియా భావిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+