వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జుకర్‌బర్గ్ మేసేజ్‌ల తొలగింపు:భద్రత కోసమేనా

By Narsimha
|
Google Oneindia TeluguNews

శాన్‌ప్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కొంతమందికి పంపిన సందేశాలను ఆ సంస్థ తొలగించింది. జుకర్‌బర్గ్ నుండి సందేశాలు అందుకొన్న వారి ఇన్‌బాక్స్‌ల నుండి ఈ మేసేజ్‌లను తొలగించింది.

సాధారణంగా ఫేస్‌బుక్ ఖాతాదారులే నేరుగా తమ ఇన్‌బాక్స్‌ల్లో ఉన్న మేసేజ్‌లను తొలగించుకొనే వీలుంది. కానీ, జుకర్ బర్గ్ కొంతమందికి పంపించిన మేజేజ్ లను డిలీట్ చేసింది. ఫేస్‌బుక్‌ మాత్రం తమ సీఈఓ ఎవరికైతే మెసేజ్‌లు పంపించారో వారి ఇన్‌బాక్స్‌ల్లో నుంచి సందేశాలను తొలగించేశారు. 'కార్పొరేట్‌ భద్రత' కోసం ఈ పని చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

mark zuckerberg

జుకర్‌బర్గ్‌ గతంలో పంపించిన సందేశాలు తమ చాట్స్‌లో నుంచి డిలీట్‌ అయ్యాయని, అయితే తాము ఇచ్చిన రిప్లైలు మాత్రం అలాగే ఉన్నాయని కొన్ని వర్గాలు చెప్పినట్లు సమాచారం. గతంలో సోనీ పిక్చర్స్‌ ఈ-మెయిల్స్‌ హ్యాక్‌ అయిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా ఫేస్ బుక్ ప్రకటించింది.

అలాగే మెసెంజర్‌లో జుకర్‌బర్గ్‌ మెసేజ్‌లు ఉండే సమయం కూడా తగ్గించినట్లు చెప్పింది. అయితే ఫేస్‌బుక్‌ టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ ప్రకారం వినియోగదారులు నిబంధనలను అతిక్రమించనంత వరకు ఫేస్‌బుక్‌కు వినియోగదారుల ఖాతాల్లో నుంచి సమాచారం తొలగించే అధికారం లేదని ఓ టెక్నాలజీ వెబ్‌సైట్‌ కథనంలో పేర్కొంది.

English summary
Have you ever sent an email or text that you wish you could take back and delete forever? That’s not possible on the open web. But we now know that Mark Zuckerberg has the power to reach into every single Facebook inbox and delete messages that he’s sent. Zuck and other executives at Facebook have reportedly used that power multiple times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X