వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టడీ: ఫేస్‌బుక్ సంతోషాన్ని దూరం చేస్తోంది!

|
Google Oneindia TeluguNews

లండన్: స్నేహితులు, సన్నిహితుల నుంచి సమాచారం తెల్సుకునేందుకు ఉపయోగిస్తున్న సోషల్ మీడియా సైట్ అయిన ఫేస్‌బుక్‌ను గంటలతరబడడి ఉపయోగించడం వల్ల మనం సంతోషాన్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందట. ఫేస్‌బుక్ ఉపయోగించే వారికంటే.. దాన్ని వాడని వారే సంతోషంగా ఉన్నారట. ఈ మేరకు ఓ అధ్యయనం తేల్చింది.

డెన్మార్క్‌లోని 'ది హ్యాపినెస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్' పరిశోధకులు దాదాపుగా 1095 మందిపై ఒక వారం రోజుల పాటు పరిశోధనలు చేశారు. వీరిలో కొంత మందిని వారం పాటు ఫేస్‌బుక్ వాడడం పూర్తిగా మానేయమని, మరికొందరికి ఎక్కువగా వాడమని చెప్పారు.

అనంతరం 'జీవితం సంతృప్తిగా ఉందా?' అనే అంశంపై వారిని పలు ప్రశ్నలు అడుగుతూ.. 1 నుంచి 10 వరకు స్కోరులో ఏదో ఒక స్కోరును ఆ ప్రశ్నలకు ఇవ్వమని చెప్పారు. ఫలితంగా తేలిందేమిటంటే వారం పాటు ఫేస్‌బుక్ వాడని వారు తమ జీవితం పట్ల ఎక్కువ సంతృప్తిగా, సంతోషంగా ఉన్నారని, ఫేస్‌బుక్ వాడే వారు సంతోషాన్ని కోల్పోతున్నారని తేలింది.

Facebook may be making you unhappy: study

సంతోషాన్ని కోల్పోతున్న వారి స్కోరు స్కేలుపై 10కి సరాసరిగా 7.67 రాగా, సంతోషంగా ఉన్న వారి స్కోరు 8.12 వచ్చింది. దీంతోపాటు తెలిసిన మరికొన్ని విషయాలు ఏమిటంటే పరిశోధనల్లో పాల్గొన్నవారిలో ఫేస్‌బుక్ వాడే వారిలో 39 శాతం మంది తమ స్నేహితుల కన్నా తక్కువ సంతోషంగా ఉన్నారని, 55 శాతం మంది ఒత్తిడి గురవుతున్నారని తెలిసింది.

ఫేస్‌బుక్ ఉపయోగించే వారిలో కోపంగా, ఒంటరిగా ఉన్నామనే భావనలు కూడా కలిగాయని వెల్లడైంది. దీన్ని బట్టి చూస్తే.. ఫేస్‌బుక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే మన జీవితంలో సంతోషం తగ్గి, అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అందుకే సోషల్ మీడియాకు వీలైనంత తక్కువ సమయం కేటాయించి పక్కన పెట్టేస్తే మంచిది.

English summary
People who are on Facebook are more likely to be unhappy and have low life satisfaction than those who do not use the social networking site, according to a new study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X