అసిమ్ మునీర్ కు లైఫ్ టైమ్ సెటిల్ మెంట్.. పాక్ సంచలన నిర్ణయం..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పదవి ముగుస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ సైన్యం పగ్గాలు అసిమ్ మునీర్ చేతిలో పెట్టేందుకు సిద్ధమైంది. మునీర్ ను మించిన మొనగాడు పాకిస్థాన్ లో లేనట్లుగా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యాంగ పరంగా అసిమ్ మునీర్ కు మరోసారి అర్హత లేకపోయినా రాజ్యాంగాన్ని సవరించి ఆయనకు ఆర్మీ బాధ్యతలను కట్టబెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) ఛైర్మన్ బిలావల్ భుట్టో- జర్దారీ తెలిపారు.
పాకిస్థాన్ ముస్లిం లీగ్(N) కు అధిపతిగా ఉన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. రాష్ట్రపతి అసిఫ్ అలీ జర్దారీని కలిసి 27 వ రాజ్యాంగ సవరణకు తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని తెలిపినట్లు భుట్టో వివరించారు. ఈ విషయాన్ని బిలావల్ భుట్టో తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. రాష్ట్రపతికి పాక్ ప్రధాని షరీఫ్ చేసిన సిఫార్సుల్లో రాజ్యాంగ కోర్టును ఏర్పాటు చేయడం, ఎగ్జిక్యూటీవ్ మేజిస్ట్రేట్ లను రీవైవ్ చేయడం, జడ్జీలను బదిలీ, అలాగే ఆర్టికల్ 243 ను సవరించడం.. తదితర విషయాలను భుట్టో ప్రస్తావించారు.
ఆర్టికల్ 243.. పాకిస్థాన్ ఆర్మీ కు సంబంధించిన అంశం. ఈ మేరకు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(CEC) నవంబర్ 6 న రాష్ట్రపతి అసిఫ్ అలీ జర్దారీ.. ధోహా నుంచి వచ్చాక పార్టీ పాలసీను చర్చించనున్నట్లు భుట్టో ట్వీట్ చేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్ పార్టీ ముస్లిం లీగ్(N)తో కలిసి ఉంది. ఈ రెండు పార్టీలు ఈ మేరకు 27 వ రాజ్యాంగ సవరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆర్టికల్ 243 లో మార్పులు చేయడం ద్వారా ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న అసిమ్ మునీర్ పదవిని మరింత సంరక్షించేందుకు.. ఆయన పదవిని పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది మొదట్లో మునీర్ కు ఫీల్డ్ మార్షల్ ర్యాంకు హోదా ఇచ్చారు. అతడి పదవీ విరమణ నవంబర్ 28, 2025 న జరగనుంది. దీంతో ఆయన పదివీ కాలాన్ని మరింత పొడిగించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం యత్నిస్తోంది.












Click it and Unblock the Notifications