Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లక్ష రూపాయల ధర పలికిన చేప: స్పెషాలిటీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

థాయ్ లాండ్ : మహా అయితే ఓ చేప రూ.1000వెయ్యి ధర దక్కించుకోవడం గురించి మనం వినుంటాం. కానీ థాయ్ లాండ్ లో ఓ చేప ఏకంగా 53,500 బాట్ (1,03,733 రూపాయల)ల ధర పలికి రికార్డుల్లోకి ఎక్కింది. కాగా, ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం.. థాయ్ లాండ్ జాతీయ జెండా రంగును ఆ చేప పోలి ఉండడమే.

 A fish got huge rate in Action

గతంలో ఇలాంటి చేపలను ఉత్పత్తి చేసినప్పటికీ.. ఇంత ఖచ్చితమైన రంగులో సత్ఫలితం రావడం ఇదే తొలిసారి. చేతితో రంగులద్దినట్టుగా సరైన ఖచ్చితత్వంతో కూడిన రంగులను కలిగి ఉంది ఈ చేప. ఫేస్ బుక్ వేదికగా గత నవంబర్‌ 6న 99 బాట్‌ ల ప్రారంభ ధరతో దీన్ని వేలానికి పెట్టగా.. నవంబర్ 9న ముగిసిన యాక్షన్ లో భారీ ధర దక్కించుకుంది.

ఈ చేప పెంపకందారుడైన కచెన్ వొరాచెయ్ సైతం ఇంత భారీ ధర పలుకుతుందని ఊహించలేకపోయాడట. వేలానికి పెట్టిన రెండో రోజే ఇది 10 వేల బాట్‌ లు పలికి, చివరకు 53,500 బాట్‌ లకు అమ్ముడుపోవడం పట్ల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+