మహా విపత్తు: ఒక్క గంట వర్షానికే 21 మంది మృతి!
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రస్తుతం విపరీతమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అలాంటి దేశాల్లో మొరాకో కూడా ఒకటి. మొరాకోలోని తీర ప్రాంతమైన సాఫీ నగరంలో ఆదివారం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సాఫీలో విధ్వంసం
రాజధాని రబాత్ నుంచి దాదాపు 330 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉన్న సాఫీ ప్రావిన్స్ పాత నగరంలో దాదాపు ఓ గంట పాటు ఎడతెగకుండా కురిసిన భారీ వర్షం ఈ విపత్తుకు కారణమైంది. కేవలం ఒక గంట పాటు కురిసిన వర్షం కారణంగా సాఫీలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల వల్ల అనేక ఇళ్లు, దుకాణాలు నీట మునిగాయి. నదులలో నీటి మట్టం పెరిగి కార్లు కొట్టుకుపోయాయి. అనేక రోడ్లు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. ఈ వరదల్లో గల్లంతై చాలా మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 21 మంది మరణించగా.. 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చగా.. చాలా మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారి పరిస్థితి సాధారణంగానే ఉంది.

ఏడేళ్ల తర్వాత భారీ వర్షపాతం
సాఫీ ప్రాంతంలో గత ఏడేళ్లుగా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నదుల్లో నీటి మట్టం బాగా తగ్గిపోయింది. ఏడేళ్ల తర్వాత ఇంత భారీగా వర్షాలు కురవడంతో నదుల్లో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగి వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా సాఫీ, పరిసర ప్రాంతాలలో రోడ్లు, వంతెనలు సహా మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని వల్ల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.
Terrifying flooding due to extreme rainfall in Safi, Morocco 🇲🇦 (14.12.2025) pic.twitter.com/h7qyrJXaHU
— Disaster News (@Top_Disaster) December 14, 2025












Click it and Unblock the Notifications