Maldives: మమ్మల్ని క్షమించరూ.. భారత్ కు మాల్దీవుల మాజీ అధ్యక్షుడి సారీ..!
భారత ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యల తర్వాత ఇరుదేశాల మధ్య తలెత్తిన గ్యాప్ అలాగే ఉంది. ఇప్పటికే మాల్దీవులను బహిష్కరించాలంటూ భారత్ ఇచ్చిన పిలుపు ప్రభావం ఆ దేశంపై తీవ్రంగా ఉంది. మోడీపై వ్యాఖ్యలు చేసిన మంత్రులతో రాజీనామాలు చేయించినా, ఆ తర్వాత మరో వ్యాఖ్య చేయకున్నా మాల్దీవులపై భారత్ లో వ్యతిరేకత మాత్రం అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తాజాగా మాల్దీవుల నుంచి భారత్ బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరిన ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు.. దీనికి డెడ్ లైన్ కూడా పెట్టేశారు. ఆ తర్వాత చైనా బలగాలను దేశంలోకి రప్పించేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఈ నేపథ్యంలో భారత్ తో వివాదాలకు ముగింపు పలికేందుకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు నషీద్ ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్ అనుకూల నేతగా పేరున్న నషీద్.. తాజాగా భారత్ కు గతంలో చోటు చేసుకున్న ఘటనలపై క్షమాపణలు చెప్పారు.

మాల్దీవుల ప్రజల తరఫున భారత్ ను క్షమాపణ కోరుతున్నట్లు ఆ దేశ మాజీ అధ్యక్షుడు నషీద్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆయన.. గతంలో చోటు చేసుకున్న ఘటనలు తమ ద్వీప దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినట్లు ఆయన తెలిపారు. వాటిపై మాల్దీవుల ప్రజల తరఫున క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. భారతీయ ప్రజలు తమ దేశంలో పర్యటించాలని కోరుకుంటున్నట్లు నషీద్ వెల్లడించారు. తమ ఆతిధ్యంలో ఎలాంటి మార్పూ ఉండబోదన్నారు.
మాల్దీవుల్లో ఉన్న భారత సైనికుల్ని రేపటి లోగా ఖాళీ చేసి వెళ్లాలని ప్రస్తుత అధ్యక్షుడు మొయిజు డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు నషీద్ చేస్తున్న ప్రయత్నాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. భారత్ కు అనుకూలమైన నేతగా పేరున్న నషీద్ క్షమాపణలపై ఇంకా స్పందించలేదు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications