• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ విషయంలో ప్రధాని మోడీ సహకారాన్ని కోరిన ఫ్రాన్స్: ఆందోళనకంగా

|

అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా మధ్య కొత్తగా కుదిరిన రక్షణ ఒప్పందం ఆకుస్ పట్ల ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఒప్పందానికి నిరసనగా ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి ఫ్రాన్స్ తన రాయబారులను వెనక్కి పిలిపించింది. ఈ రక్షణ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలపై వారితో చర్చించనుంది. ఈ విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మక్రాన్.. భారత్ సహాయాన్ని కోరారు. తమకు అండగా నిలవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీతో ఫోన్‌లో సంభాషించారు.

అణు జలాంతర్గాముల టెక్నాలజీ బదిలీ కోసం..

అణు జలాంతర్గాముల టెక్నాలజీ బదిలీ కోసం..

ఈ అణు ఒప్పందాల్లో భాగంగా- అమెరికా, బ్రిటన్‌ అణు జలాంతర్గాములను తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆస్ట్రేలియాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో చైనా ప్రాబల్యాన్ని, దూకుడును అడ్డుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందంగా దీన్ని భావిస్తున్నారు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నెలకొనడానికి కారణమైన తరువాత చైనా.. క్రమంగా దక్షిణ సముద్రంపై పట్టు పెంచుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే.

ఫ్రాన్స్ అసహనం..

ఫ్రాన్స్ అసహనం..

దీనిపై ఆస్ట్రేలియా ముందు నుంచి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తోంది. భారత్ సైతం చైనా కదలికలను నిశితంగా పరిశీలిస్తూ వస్తోంది. ఈ పరిణామాల మధ్య అణు ఆధారిత జలాంతర్గామిని తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఙానాన్ని పొందడానికి అమెరికా, బ్రిటన్‌పై ఆధానపడింది ఆస్ట్రేలియా. ఈ రెండు దేశాలతో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఇక్కడ ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేయడానికి, ఈ ఒప్పందం పట్ల అసహనాన్ని ప్రదర్శించడానికి కారణాలు లేకపోలేదు.

40 బిలియన్ డాలర్లు

40 బిలియన్ డాలర్లు

ఇదే అణు జలాంతర్గామిని తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడానికి ఆస్ట్రేలియా ఇదివరకు ఫ్రాన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని విలువ 40 బిలయన్ డాలర్లు. ఇప్పుడు తాజాగా ఆ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌లతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఫ్రాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఒప్పందాన్ని రద్దు చేసుకునే విషయంపై ఫ్రాన్స్‌కు ఆస్ట్రేలియా ముందస్తు సమాచారాన్ని ఇవ్వలేదు. కొన్ని గంటల ముందు మాత్రమే సమాచారం ఇచ్చింది ఆస్ట్రేలియా.

మోడీకి మక్రాన్ ఫోన్..

మోడీకి మక్రాన్ ఫోన్..

ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో తమకు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 40 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒప్పందాలను చివరి నిమిషంలో ఆస్ట్రేలియా రద్దు చేసిందని చెప్పారు. దీనికోసం ఎలాంటి సహేతుక కారణాన్ని కూడా ఆస్ట్రేలియా వెల్లడించలేదని అన్నారు. ఈ మేరకు మోడీకి మక్రాన్ ఫోన్ చేశారు. ఆప్ఘనిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలతో పాటు ఆస్ట్రేలియా వ్యవహారాన్ని కూడా ఆయన మోడీ వద్ద ప్రస్తావించారు.

అమెరికా అధినేత దృష్టికి..

అమెరికా అధినేత దృష్టికి..

తన మూడు రోజుల అమెరికా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయలుదేరి వెళ్లడానికి ముందే- ఎమ్మానుయెల్ మక్రాన్ ఆయనకు ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా పర్యటనకు వెళ్తోన్నందున న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యే ఆయా దేశాధినేతలతో ఈ ఒప్పందం మీద సంప్రదింపులు జరపాలని మక్రాన్.. మోడీని కోరినట్లు చెబుతున్నారు. దీనిమీద మోడీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఎలాంటి హామీ ఇచ్చారనేది తెలియరాలేదు.

యూరోపియన్ యూనియన్ సైతం

యూరోపియన్ యూనియన్ సైతం

ఆస్ట్రేలియా-ఫ్రాన్స్ మధ్య కుదిరిన అణు జలాంతర్గాముల ఒప్పందం చివరి నిమిషంలో రద్దు కావడం పట్ల యూరోపియన యూనియన్ దేశాల కూడా అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీలక ఒప్పందాన్ని ఆస్ట్రేలియా రద్దు చేసుకోవడం.. దానికి సంబంధించిన సమాచారాన్ని చివరి నిమిషంలో తెలియజేయడం సబబు కాదనే అభిప్రాయపడుతోంది యూరోపియన్ యూనియన్. ఇదేదో ఓ రాత్రిల కుదిరిన ఒప్పందం కాదని, దీని కోసం శ్రమించాల్సి వచ్చిందని పేర్కొంది.

English summary
President Emmanuel Macron has discussed cooperation in the Indo-Pacific region with Indian Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X