అమెరికాలో ‘అపరిచితుడు’.. దెయ్యం పేరు చెప్పి మరీ ఇంత ఘోరమా?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఫ్లోరిడా: అపరిచితుడు సినిమా గుర్తుంది కదా? ఈ వార్త చదువుతుంటే ఆ సినిమాయే గుర్తొస్తుంది ఎవరికైనా. అందులో ఒక వ్యక్తి ముగ్గురు వ్యక్తులుగా నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.

అమెరికాలోని ఫ్లోరిడాలో అచ్చం ఇలాంటి సంఘటనే ఇటీవల జరిగింది. సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఆస్టిన్ హరూఫ్(20) అనే కాలేజీ విద్యార్థి ఈ మధ్య తనకు దెయ్యం కనిపిస్తోందని చెబుతున్నాడు. అది కనిపించినప్పుడు తాను ఏం చేస్తున్నానో కూడా తనకు అర్థం కావడం లేదని అంటున్నాడు. ఈ కుర్రాడు ఈ మధ్యనే ఓ దారుణానికి పాల్పడ్డాడు.

తనకు ఒకరోజు నల్లటి ఆకారం కనిపించిందని, అది తన పేరు డేనియల్ అని చెప్పి తనతో పరిచయం చేసుకుందని, ఒకరోజు తాను కాలేజి నుంచి ఇంటికి చేరుకున్న సమయంలో డేనియల్ తనకు కనిపించి తనతో రమ్మన్నాడని హరూఫ్ చెప్పాడు.

 Frat boy accused of killing couple and chewing man’s face

తనను దగ్గర్లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడని, తనకు అంతవరకే గుర్తుందని చెబుతున్నాడు. కానీ ఆ తరువాత ఏం జరిగిందంటే... ఆస్టిన్ ఆ ఇంట్లో నిద్రపోతున్న భార్యాభర్తలిద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు. వాళ్లు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. అంతటితో ఊరుకోకుండా భర్త ముఖాన్ని పీక్కుతినేశాడు.

ఇదంతా ఆ ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు ఆస్టిన్ ను అరెస్ట్ చేశారు. తరువాత అతడిని కోర్టులో హాజరుపరచగా, ఆస్టిన్ ఈ ఘాతుకానికి పాల్పడలేదని అతడి తరపు లాయర్ వాదించాడు.

దెయ్యం ప్రోత్సహించినందువల్లే ఈ ఘోరం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా జరగలేదని లాయర్ వాదించడంతో.. కోర్టులో జడ్జి ముందు నేరస్థుడిని సైకాలజిస్ట్ కు చూపించమని పోలీసులను ఆదేశించింది. దీంతో వారు అతడిని మాక్స్ గ్రోవ్ అనే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఆస్టిన్ ప్రవర్తనను వీడియో తీశారు. డేనియల్ పేరు చెప్పగానే అతడి ముఖం, హావభావాలు మారిపోతున్నట్లు సైకాలజిస్ట్ మాక్స్ గ్రోవ్ కూడా గుర్తించారు.

తన వల్ల మరణించిన జాన్ స్టీవ్స్(59), మిషెల్ మిచెన్(53)లకు ఆస్టిన్ 'సారీ' చెప్పాడు. తాను వారిని చంపలేదంటూ గట్టిగా అరుస్తూ, తన దుస్తులు చింపేసుకున్నాడు. ఇవన్నీ గమనించిన సైకాలజిస్ట్ మాక్స్ గ్రోవ్ మానసిక సమస్యలతోనే ఆస్టిన్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.

అతడు తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని, అలాంటి సందర్భాలలో మనుషులు నియంత్రణ, విచక్షణ కోల్పోతారని, అందువల్ల వారు వింతగా ప్రవర్తిస్తుంటారని ఆయన వివరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A COLLEGE student accused of killing a couple and chewing off a man’s face has broken down on camera while talking about the horrific incident. In a 22-minute interview released by prosecutors, Austin Harrouff, a former Florida State University student, begged the victims’ family for forgiveness while sobbing uncontrollably. While talking with TV psychologist Phil McGraw, Harrouff described being tormented by a “dark figure” which he called Daniel.Harrouff, 20, was arrested last August in connection with the murder of John Stevens, 59, and his wife, Michelle Mishcon, 53.
Please Wait while comments are loading...