మండేలాకు కడపటి వీడ్కోలు: ప్రపంచ నేతల నివాళి
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా స్మారకార్థం మంగళవారం దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లోని ఎఫ్ఎన్‌బి స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రపంచంలోని సుమారు 90మంది ప్రముఖ నాయకులతోపాటు వేలాదిమంది పౌరులు తమ అభిమాన నేతకు ఘనమైన నివాళులు అర్పించారు.
సంస్మారణ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ దంపతులు, జార్జ్ బుష్, జిమ్మి కార్టర్, 53కిపైగా దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు హాజరయ్యారు.

మన దేశం నుంచి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్, కేంద్రమంత్రి ఆనంద్ శర్మ, సిపిఎం నేత సీతారాం ఏచూరి, బిఎస్‌పి నాయకుడు సతీష్ మిశ్రాలు కూడా దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు.

కాగా జొహన్నెస్‌బర్గ్‌లోని ఎఫ్ఎన్ బి స్టేడియంలో 2010లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సందర్భంగా నెల్సన్ మండేలా చివరిసారిగా ప్రజలకు కనిపించారు. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రముఖులు ఈ సంస్మారణ కార్యక్రమంలో పాల్గొని నెల్సన్ మండేలాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెల్సన్ మండేలా జాతికి చేసిన సేవలను నేతలు కొనియాడారు. మండేలా అంత్యక్రియలు డిసెంబర్ 15న జొహన్నెస్‌బర్గ్‌లోని తన పూర్వీకుల నివాస ప్రాంతంలో జరగనుంది.












Click it and Unblock the Notifications