AI నుంచి స్పోర్ట్స్ వరకు: ఐజీఎఫ్ మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా రెండవ రోజు హైలైట్స్..!!

ది ఇండియా గ్లోబల్ ఫోరం మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా(IGF ME&A) 4వ ఎడిషన్‌లో భాగంగా వేగవంతంగా మార్పు చెందుతోన్న ఆర్థిక వ్యవస్థలో నూతన అవకాశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. భారత్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఇండియా గ్లోబల్ ఫోరం పై రెండవ రోజున భారత్‌తో పాటు ప్రపంచదేశాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. భారత్ యూఏఈ, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు సరికొత్త అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఫోరంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి.

రెండవ రోజున ప్రముఖ కమెడియన్,యూఏఈలోని డుబోమెడి సహవ్యవస్థాపకులైన మినా లిసియోన్ మాట్లాడారు.సామాజిక సమస్యలను పరిష్కరించడంలో హాస్యం ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు.కమెడియన్‌లు చేసే మాటలను ప్రజలు ఎక్కువగా వినేందుకు ఆసక్తి చూపుతారని అందులో నిజం ఉంటుందని చెప్పారు. అది హాస్యంతో కూడినదైతే మరింత శ్రద్ధతో వింటారని అన్నారు.పురుషాధిక్యం ఉన్న రంగంలో తనను ఒక కమెడియన్‌గానే చూడాలని, మహిళా కమెడియన్ అనే ముద్ర పడటం లేదా కామెడీలో మహిళ అని చెప్పడం తనకు ఇష్టం ఉండదన్నారు.

ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలుతున్న యుగంలో సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలని డీపీ వరల్డ్ జీసీసీ డిజిటల్ టెక్నాలజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబుల్ హమ్రా పిలుపునిచ్చారు. "ఈ రోజుల్లో పరిశ్రమల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది.వాణిజ్యం రవాణా పరిశ్రమల్లో ఏఐ అనూహ్య మార్పులు తీసుకొచ్చి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తోంది.డిజిటల్ టెక్నాలజీ, ఏఐలు రెండూ కలగలిపి ప్రతి సప్లయ్ చైన్‌లో కనిపిస్తున్నాయి.ఏఐ సహాయంతో ఎగుమతి దిగుమతి ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం.తద్వారా దుబాయ్‌లోని లాజిస్టిక్స్ రంగానికి మరింత ఊతమిచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి" అని మొహ్మద్ అబుల్ హమ్రా పేర్కొన్నారు.

IGF

ఇక ఇండస్ట్రీలోని టాప్ పారిశ్రామికవేత్తలు,ఇన్వెస్టర్లు బిజినెస్ కమ్యూనికేషన్ గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు." మంచి ఆలోచనకు చెడు ఆలోచన మధ్య తేడా ఏంటి..?నిజమైన ఆలోచనే అయితే అది వ్యాపారంలో ఎదురయ్యే నిజమైన సమస్యలను ఎలా పరిష్కరిస్తుంది?సంప్రదాయ బిజినెస్ మోడల్స్‌కు అది పరిష్కారం చూపగలిగితే నాకైతే అది మంచి ఆలోచనే.అదికూడా టెక్నాలజీని వినియోగించి మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేదైతే అలాంటి ఆలోచనను కచ్చితంగా స్వాగతించాల్సిందే" అని సోరిన్ అడ్వైజర్స్ ఎల్ఎల్‌పీ వ్యవస్థాపకులు ఛైర్మెన్ సంజయ్ నాయర్ చెప్పారు.

ఆరోగ్య రంగంలో ఏఐ పాత్ర

ఇక ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్యభద్రతలో దీని ప్రాముఖ్యతపై చర్చ జరిగింది.ఆరోగ్య రంగంలో ఏఐ ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందనే అంశంపై చర్చ జరిగింది."ఆరోగ్యభద్రత విషయంలో ఏఐ ప్రభావం చాలా ఉంది.ఏఐ వినియోగంతో ఆరోగ్య వ్యవస్థ అందరికీ అందుబాటులోకి వచ్చింది.ఒకప్పుడు డాక్టర్ పేషెంట్‌ను పరీక్షించి ఎలాంటి వైద్యం చేయాలో నిర్ణయించేందుకు దాదాపుగా 10 నుంచి 12 నిమిషాల సమయం తీసుకుంటుండగా ఇప్పుడు ఏఐ వినియోగంతో అది ఒక నిమిషంలో జరిగిపోతోంది" అని ఫార్మ్ ఈజీ అధినేత సిద్ధార్థ్ షా చెప్పారు.

సుస్థిరమైన భవిష్యత్తు కోసం ఆర్థిక వ్యూహాలు:

"ఆఫ్రికా దేశాన్ని ఒక వాణిజ్య అవకాశాలు కల్పించే దేశంగా చూడొచ్చు.వాతావరణ సంక్షోభం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే వాతావరణం పరంగా చూసుకుంటే ఆఫ్రికా దేశం ప్రపంచ దేశాలకు పచ్చటి ఊపిరితిత్తుల్లా కనిపిస్తుంది" అని ఏఐ ఏఆర్‌డీ సస్టెయినబులిటీ కన్సల్టెన్సీ సీఈఓ వ్యవస్థాపకులు హనన్ బకర్ సకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

గ్రౌండ్ నుంచి నేర్చుకున్న పాఠాలు-క్రీడారంగంలో భారత్ భవిష్యత్తు

"స్పోర్ట్స్ లీగ్‌ను ప్రారంభించడం సవాలుతో కూడుకున్న పని ఎంతమాత్రం కాదు అయితే దాన్ని కొనసాగించడం లేదా నిలుపుకోవడం సవాలుతో కూడుకున్న పని.ఒక లీగ్‌ స్థిరంగా ఉండాలంటే స్టార్ ప్లేయర్లు ఉండాలి ప్రత్యేకించి ఇండియన్ లీగ్స్‌లో భారత స్టార్ ఆటగాళ్లు ఉండాలి.భారత్‌లో క్రికెట్ ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోందంటే అందుకు కారణం 50 నుంచి 60 మంది స్టార్ ఆటగాళ్లున్నారు.కేవలం 11 మందితో ఇది సక్సెస్ అవడం లేదు. దీనివెనుక వ్యూయర్షిప్ కీలక పాత్ర పోషిస్తోంది.అందువల్లే ఈ క్రీడకు స్పాన్సర్లు,బ్రాడ్‌కాస్ట్ సపోర్ట్ ఉండటంతో క్రికెట్ వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది.స్టార్ ప్లేయర్లు లేని లీగ్ ఫెయిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ లీగ్‌లు క్రమంగా కనుమరుగయ్యాయి" అని మాజీ టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి చెప్పారు.

అందం, ఆరోగ్యం సోషల్ మీడియా

అందం ఆరోగ్యం పై జరిగిన చర్చలో ఫేబుల్ అండ్ మానే సీఈఓ, సహవ్యవస్థాపకులు ఆకాష్ మెహతా మాట్లాడారు.మన సంస్కృతిని చాటిచెప్పేలా ఒక బ్రాండ్‌ను ప్రారంభించాలనే యోచనలో ఉన్నాను. మన వారసత్వాన్ని సంప్రదాయాన్ని గౌరవించడం వరకు మాత్రమే మనకు తెలుసు.మన మూలాలను ఎప్పుడూ గౌరవిస్తాం.భారత్‌కు తిరిగి వెళ్లి మన పూర్వీకులు, పెద్దల నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటాం. ఇదంతా మన భవిష్యత్తు తరాలకు మనం అందించే ఆస్తి అని ఆకాష్ మెహతా చెప్పారు.

కంటెంట్ ఉన్నవాడే కింగ్

ఇక చివరిగా సోషల్ మీడియాలో కంటెంట్,క్రియేటివిటీ, ఇన్ఫ్లుయెన్స్ పై చర్చతో ఆరోజు ముగిసింది.ప్రపంచ దేశాల భాగస్వామ్యంతో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు కనుగొనాలని IGF ME&A తీర్మానించింది.అదే సమయంలో కలసి సాధించే విజయాలపై కూడా చర్చించాలని ఈ సందర్భంగా తీర్మానించాయి. మొత్తం 9 రంగాలకు చెందిన 200 మంది స్పీకర్లు, 1000 మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇండియా గ్లోబల్ ఫోరమ్ సమకాలీన భారతదేశ కథను చెబుతుంది.వేగవంతమైన వృద్ధి,భారత్‌లో చోటు చేసుకున్న మార్పులు ప్రపంచానికి అవకాశాలు కల్పిస్తున్నాయి.ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఒక ప్రధాన ద్వారంగా ఐజీఎఫ్ పనిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+