ఆ దేశంలో పుట్టడమే శాపమా..? యుద్ధంతో సర్వం కోల్పోయి.. ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ధర రూ. 2,300
పార్లేజీ బిస్కెట్లు అంటే చిన్నారులకు చాలా ఇష్టం కదా. కానీ ఆ దేశంలో పుట్టడం చిన్నారులకు శాపంగా మారింది. మన దేశంలో రూ. 5 కే దొరికే బిస్కెట్ ప్యాకెట్ ను కొనాలంటే ఆ దేశంలోని చిన్నారులు రూ. 2,300 చెల్లించాలి. భారత్ కు ఆ దేశానికి దాదాపు 4,300 కిలోమీటర్లు దూరం ఉంది. గాజాలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఈ ఒక్క విషయం చెబుతోంది.
చిన్నారులు ఇష్టంగా తినే బిస్కెట్ ప్యాకెట్ ధర భారత్ లో రూ. 5 ఉండగా గాజాలో మాత్రం 500 టైమ్స్ అధికంగా అమ్ముడవుతోంది. స్థానిక కరెన్సీ ప్రకారం 24 యూరోలు అంటే రూ. 2,300 చెల్లిస్తేనే ఓ బిస్కెట్ ప్యాకెట్ దొరుకుతుంది. మన దేశంలో చిన్నారులకు పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ సుపరిచితమే.. టీ తాగే సమయంలోనూ తింటుంటారు. కానీ వార్ జోన్ ప్రాంతమైన గాజాలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య భీకర పోరు ఏళ్లకు ఏళ్లుగా సాగుతూనే ఉంది. అమెరికా లాంటి దేశాలు మధ్యవర్తిత్వం చేయాలని చూసినా చర్చలు ఫలించలేదు. యుద్ధం కారణంగా అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. అనేక మంది ప్రజలు ఆహారం కొనే పరిస్థితి లేక దాతల కోసం ఎదురుచూస్తున్నారు. భారత్ లో కేవలం ఐదు రూపాయలకే లభించే బిస్కెట్ ప్యాకెట్ ధర గాజాలో రూ. 2,300 ఉంది. దీన్ని బట్టే అక్కడ సంక్షోభం ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతోంది.

తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఓ వీడియో అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఓ తండ్రి తన కుమారుడికి ఇష్టమైన పార్లే- జీ బిస్కెట్ ప్యాకెట్ కొని తెచ్చాడు. ఆయన గతంలో కొన్నప్పుడు ఆ ప్యాకెట్ ధర 1.5 యూరోలు కానీ ఇప్పుడు 24 యూరోలు. అయినా తన కుమారుడికి ఈ బిస్కెట్స్ ఇష్టం కాబట్టి తీసుకురావడం తప్పడం లేదు. అని గాజాలోని ఓ తండ్రి ఎక్స్ వేదికగా చేసిన ఓ ఎమోషనల్ పోస్టు నెట్టింట వైరల్ అయింది. దీంతో అక్కడి పరిస్థితి ఎలా ఉందో ప్రపంచానికి అర్థమైంది.
After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF
— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025
ఇటీవల వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(WFP) కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోని ప్రజలు కరవుతో అల్లాడుతున్నారు. యుద్ధం మళ్లీ తీవ్రతరం కావడంతో బోర్డర్లు అన్నీ మూసేశారు. ఆహార నిల్వల కొరత ఏర్పడింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. అని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టింది.ఈ ఏడాది మార్చి 2 నుంచి ప్రపంచ దేశాల సాయం ఆగిపోయిందని.. అప్పటి నుంచి అక్కడి పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం పేర్కొంది. గాజాలో దాదాపు 4 లక్షల 70 వేల మంది క్రిటికల్ హంగర్ సమస్యతో ఉన్నారని వివరించింది.












Click it and Unblock the Notifications