వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ భారత్‌-పాక్‌ స్నేహం- ధోవల్‌తో పాక్ ఆర్మీఛీఫ్ బజ్వా చర్చలు ? - సైన్యం రివర్స్‌

|
Google Oneindia TeluguNews

ఉపఖండంలో దాయాది దేశాలైన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న కోల్డ్‌ వార్‌కు తెరదించేందుకు ఇరుదేశాల ప్రభుత్వాలు తెరవెనుక భారీ ప్రయత్నాలే చేస్తున్నాయి. భారత్‌వైపు నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, పాకిస్తాన్ వైపు నుంచి ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ బజ్వా రహస్య చర్చలు జరుపుతున్నారు. అయినా దశాబ్దాలుగా పాతుకుపోయిన భారత్‌ వ్యతిరేక వైఖరిని మార్చుకునేందుకు సైన్యం అంగీకరించడం లేదని తెలుస్తోంది. దీంతో తాజాగా ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణతో పాటు చోటు చేసుకున్న పలు పరిణామాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి.

మళ్లీ చిగురిస్తున్న భారత్‌-పాక్‌ స్నేహం

మళ్లీ చిగురిస్తున్న భారత్‌-పాక్‌ స్నేహం

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరంతో ఇప్పటికీ ఇరుదేశాలూ భారీగా నష్టపోతున్నాయి. తీవ్రవాదాన్ని ఓ స్ధాయి వరకూ పెంచి పోషించిన పాకిస్తాన్‌ ఆ తర్వాత తానే బాధిత దేశంగా మారిపోయే సరికి దిక్కులు చూడాల్సిన పరిస్ధితి. భారత్‌ వ్యతిరేక వైఖరితో పాకిస్తాన్‌లో ప్రభుత్వాలు ఏర్పడటం, పాకి్స్తాన్‌పై యుద్దాన్ని బూచిగా చూపుతూ భారత్‌లో రాజకీయాలు సాగడం పరిపాటిగా మారిపోయింది. కానీ తాజాగా ఇరుదేశాల మధ్య మరోసారి స్నేహం చిగురిస్తోంది. అనూహ్యంగా ఇరుదేశాలూ కాల్పుల విరమణ ప్రకటించగా.. ఆ తర్వాత భారత్‌ కరోనా వ్యాక్సిన్లు పంపేందుకు సిద్ధమైంది. ఆ తర్వాత వాణిజ్య సంబంధాలు కూడా తిరిగి ప్రారంభం అవుతాయని భావించినా పాకిస్తాన్ చివరికి అడ్డుపుల్ల వేసింది.

భారత్‌ పాక్‌ స్నేహనికి తెరవెనుక చర్చలు

భారత్‌ పాక్‌ స్నేహనికి తెరవెనుక చర్చలు


భారత్, పాకిస్తాన్‌ మధ్య తాజాగా మారుతున్న పరిణామాలకు నిర్దిష్ట కారణాలు బయటపడకపోయినా తెరవెనుక మాత్రం రహస్యంగా చర్చలు సాగుతున్నట్లు మాత్రం అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ముఖ్యంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, పాకిస్తాన్‌ తరఫున ఆర్మీ జనరల్ కమర్‌ జావెద్ బజ్వా ఈ చర్చలకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్-పాక్‌ మధ్య వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. కాల్పుల విరమణతో మొదలైన ఈ చొరవ ఆ తర్వాత ఇరుదేశాలూ పలు నిర్ణయాలు తీసుకునే దిశగా సాగుతోంది. దీంతో ఇరుదేశాల మధ్య గతంలో వాజ్‌పేయ్‌ ప్రభుత్వ హయాంలో ఉన్న తరహాలో సంబంధాలు నెలకొంటాయా అన్న చర్చ కూడా సాగుతోంది.

భారత్‌తో స్నేహం కోరుతున్న పాక్‌ ఆర్మీ ఛీఫ్‌

భారత్‌తో స్నేహం కోరుతున్న పాక్‌ ఆర్మీ ఛీఫ్‌

మార్చీ 18న ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్‌ కమర్ జావెద్ బజ్వా భారత్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. భారత్‌పై పాకిస్తాన్‌ వైఖరి మారాల్సిన అవసరం ఉందని బజ్వా తొలిసారి చెప్పారు. దీంతో గతంలో ఆర్మీఛీఫ్‌గా పనిచేసి ఆ తర్వాత నియంతగా మారిన జనరల్ ముషారఫ్ తరహాలోనే బజ్వా కూడా భారత్‌తో సత్సంబంధాలకు తెరదీస్తున్నారా లేక ఇదో కుట్రలో భాగమేనా అన్న చర్చలు అంతర్జాతీయంగా సాగుతున్నాయి. ఏదేమైనా బాలాకోట్‌ దాడుల తర్వాత భారత్‌తో దిగజారిన సంబంధాల పునరుద్ధరణ కోసం బజ్వా చూపుతున్న చొరవ మాత్రం స్వాగతించాల్సిన పరిణామంగా ఇరుదేశాల సంబంధాలను నిశితంగా గమనిస్తున్న వారు చెప్తున్నారు.

జనరల్‌ బజ్వా ప్రతిపాదనకు సైన్యం అడ్డుపుల్ల ?

జనరల్‌ బజ్వా ప్రతిపాదనకు సైన్యం అడ్డుపుల్ల ?

భారత్‌లో పాకిస్తాన్‌ సంబంధాల్లో పెనుమార్పులు రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ కమర్ జావెద్‌ బజ్వా ప్రతిపాదనకు సైన్యం నుంచి ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా పాకిస్తాన్‌ను శత్రువుగా చూస్తున్న భారత్‌తో ఇప్పుడు సత్సంబంధాలు కోరుకుంటే స్వదేశంలో ప్రజల్లో పలుచన అవుతామని సైన్యం వాదిస్తోంది. దీంతో జనరల్‌ బజ్వా ప్రతిపాదనకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.. గతంలో జనరల్‌ ముషారఫ్ హయాంలో భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పినా, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పాక్‌ సైన్యం జనరల్‌ బజ్వాకు గుర్తు చేస్తోంది. దీంతో తాజాగా భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గడం వెనుక కూడా ఇదే కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
it looks like the first roadblock in the path of Pakistan Army chief General Qamar Javed Bajwa’s ambition to bring about a ‘paradigm shift’, a desire he expressed during his speech at the Islamabad Security Dialogue on 18 March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X