గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, బాంబు పేల్చిన నాసా, ముందు మునిగేది మన నగరమేనా!?

గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికాలో మంచు ఫలకాలు కరిగిపోతే న్యూయార్క్‌, లండన్‌, ముంబై లాంటి మహానగరాలకు వాటిల్లే ముప్పు కంటే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూర్‌కే ముంపు తీవ్రత ఎక్కువగా ఉంటుందట.

Recommended Video

    NASA predicts This city will flood first due to melting ice | Oneindia Telugu

    వాషింగ్టన్‌ : గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికాలో మంచు ఫలకాలు కరిగిపోతే న్యూయార్క్‌, లండన్‌, ముంబై లాంటి మహానగరాలకు వాటిల్లే ముప్పు కంటే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూర్‌కే ముంపు తీవ్రత ఎక్కువగా ఉంటుందట.

    ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. గ్రెడియంట్‌ ఫింగర్‌ప్రింట్‌ మ్యాపింగ్‌(జీఎఫ్‌ఎం) పేరిట ఈ మధ్యే నాసా ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టింది. దాని ద్వారా ప్రపంచంలోని ఏయే ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉండబోతుందో అంచనా వేస్తోంది.

    Global warming: NASA tool predicts which city will flood first - Mangalore, Mumbai at risk

    సుమారు 293 పోర్టు పట్ణణాలను పరిశోధించిన నాసా ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. గ్రీన్‌ లాండ్‌ ఉత్తరాది, తూర్పు వైపున ఉన్న మంచుపొరలు కరిగిపోయి న్యూయార్క్ పట్టణానికి ఏర్పడే ప్రమాదం కన్నా... మంగళూరుకు ఏర్పడే ముప్పు ఎక్కువగా ఉందని నాసా పరిశోధనలో తేలింది.

    గ్లోబల్‌ వార్మింగ్‌ మూలంగా ధ్రువాలలోని మంచు ఫలకాలు కరిగిపోయి తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని చాలాకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. వాయవ్య గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు ఫలకాలు కరగటం వల్ల లండన్‌ సముద్ర మట్టం పెరుగుతుందని శాస్త్రవేత్త ఎరిక్‌ ఇవాన్‌ చెప్పారు.

    భారత్ విషయానికొస్తే... కర్నాటకలోని సముద్ర మట్టం ముంబై కంటే అధికంగా ఉందట. ముంబైలో సముద్ర మట్టం1.526ఎంఎం మాత్రమే ఉండగా, మంగళూరులో నీటి మట్టం 1.598 ఎంఎం ఉందట. వరదలు సంభవించినప్పుడు ఓడరేవు నగరాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలట.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలట.

    భూభ్రమణంతో పాటు గురుత్వాకర్షణ ప్రభావాల ఆధారంగా నీటి పంపిణీ ఎలా జరుగుతుందో నాసా తాజాగా కనుగొన్న గ్రెడియంట్‌ ఫింగర్‌ప్రింట్‌ మ్యాపింగ్‌ అంచనా వేస్తుందట. కర్ణాటకలోని మంగళూరుతోపాటు కరాచీ, చిట్టాగాంగ్‌, కొలంబో పట్టణాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందట.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+