Texas Elections: టెక్సాస్ మేయర్ ఎన్నికల్లో గుంటూరు టెక్కీ పోటీ.. పూర్తి వివరాలు..
Karthik Naralasetty: అమెరికాలో మరో 5 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే గతంలో అధ్యక్షపదవిని కైవసం చేసుకున్న ట్రంప్‌తో పాటు భారత సంతతికి చెందిన కమలా హారిస్ రేసులో పోటీపడుతున్నారు. ప్రపంచం మెుత్తం ప్రస్తుతం ఈ ఎన్నికల సమరాన్ని ఆసక్తిగా పరిశీలిస్తోంది. ఎవరు ఎన్నికైతే తమకు ఎలాంటి లాభాలు ఉంటాయనే ఆలోచనలో కార్పొరేట్ కంపెనీలు సైతం ఉన్నాయి. మరో పక్క ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ట్రంప్ కోసం భారీగా నిధులు విరాళంగా అందించటంతో పాటు ఆయనను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు.
ఈ క్రమంలో భారతీయులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న అంశం కూడా ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన భారతీయ అమెరికన్ ఎన్నికల్లో పోటీ చేయటమే. అవును ఇప్పుడు 35 ఏళ్ల కార్తీక్ నరలశెట్టి అనే వ్యక్తి పేరు ప్రధానంగా వార్తల్లో నిలిచింది. ఈ యూఎస్ ఆధారిత టెక్ వ్యవస్థాపకుడు టెక్సాస్‌లోని హిల్స్ విలేజ్‌లో మేయర్ పదవికి పోటీ పడుతుండటం గమనార్హం. దీనికి ఎన్నికలు నవంబర్ 5న US అధ్యక్ష ఎన్నికల 2024తో సమానంగా జరుగుతాయని వెల్లడైంది. 'అందరూ వారి నేపథ్యంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందే' ప్రదేశంగా ఉండాలని హిల్స్ ఉండాలని నరలశెట్టి పేర్కొన్నాడు.

తాను మేయర్ పదవికి పోటీ చేస్తున్నప్పుడు వ్యవస్థాపక ప్రయాణంలో నేర్చుకున్న పాఠాల ద్వారా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాడు. నరలశెట్టి మెంటర్‌షిప్, పోటీల ద్వారా విద్యార్థుల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి హిల్స్ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రామ్‌ను ప్రతిపాదించారు. "నో క్లోజ్డ్ డోర్స్, జస్ట్ ఓపెన్ కాన్వర్జేషన్" అనే అతని ప్రచార నినాదం నగర ప్రభుత్వం నివాసితుల మధ్య పారదర్శకత, సహకారంపై దృష్టి పెడుతుంది.
గుంటూరు జిల్లాకు చెందిన కార్తిక్ దిల్లీలో విద్యను పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని రట్జర్స్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదవటానికి వెళ్లాడు. అయితే మధ్యలోనే తప్పుకున్న కార్తిక్ తిరిగి ఇండియాకి వచ్చేశాడు. ఈ క్రమంలోనే మొదటి రక్తదాన సంస్థ సోషల్ బ్లడ్ ను ప్రారంభించాడు. దీని తర్వాత కుక్కల యజమానులను గ్రూమర్‌లతో అనుసంధానించే లక్ష్యంతో నరాలశెట్టి 'పావ్ష్' పేరుతో మరో వెంచర్‌ను ప్రారంభించాడు. తర్వాత ఆపిల్, వాల్‌మార్ట్, లెవిస్‌లతో సలహాదారుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications