భారతీయులకు మరింత భారంగా అమెరికా హెచ్1బీ వీసా

వాషింగ్టన్: అమెరికాకు వెళ్లే భారతీయులకు కొంత నిరాశ కలించే వార్త ఇది. హెచ్‌-1బీ వీసాల నమోదు ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు అమెరికా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీ చేసే వీసా ఎంపిక ప్రక్రియకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఒక లబ్ధిదారు బహుళ దరఖాస్తులు చేసుకున్నా ఒకే అప్లికేషన్‌గా పరిగణించనున్నారు.

ఒకే లబ్ధిదారుని తరఫున అనేక రిజిస్ట్రేషన్లు సమర్పించి సంస్థలు, లాటరీ విధానంలో ప్రయోజనం పొందేందుకు యత్నిస్తున్నందున అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా దరఖాస్తుదారులకు సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం(USCIS) స్పష్టం చేసింది. ప్రతీ లబ్ధిదారు సరైన పాస్‌పోర్టు వివరాలు, ప్రయాణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. తప్పుడు సమాచారం ఉన్న పిటిషన్లను తిరస్కరించే నిర్ణయం USCISకు ఉంది.

 H-1B visa lottery revamp: Fee hike to revised application structure

కాగా, పాస్‌పోర్టు, ఇతర గుర్తింపు వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. హెచ్‌-1బీ వీసాల మొదటి రిజిస్ట్రేషన్‌ పీరియడ్‌ మార్చి 6 నుంచి 22 వరకు కొనసాగనుంది. ఈలోగా రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుము చెల్లింపుల కోసం USCIS ఆన్‌లైన్‌ అకౌంట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి కంపెనీలు తమ ఖాతాలను తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నాయి. ఫామ్​ ఐ-129, నాన్​- క్యాప్ హెచ్​-1బీ పిటిషన్ల కోసం ఫామ్​ ఐ-907 పత్రాలను ఆన్‌లైన్​లో సమర్పించాల్సి ఉంటుందని USCIS పేర్కొంది.

అయితే, వృత్తి నిపుణులకు ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్​-1బీ వీసాలను జారీ చేస్తుంటారు. ఇందుకోసం ఏటా 65 వేల వీసాలతో పాటు మాస్టర్స్​ డిగ్రీ చేసే వారి కోసం మరో 20వేల వీసాలను మంజూరు చేస్తారు. నాన్​ ఇమిగ్రేషన్ హెచ్​-1బీ వీసాలను పొందేవారిలో ఎక్కువమంది భారతీయులే ఉండటం గమనార్హం. ఈ నాన్​- ఇమిగ్రేషన్ వీసాలు అనేవి అమెరికాలో కొంతకాలం ఉండాలనుకునేవారికి ఇస్తారు. వీటిని కంప్యూటరైడ్జ్ లాటరీ విధానంలో ఎంపిక చేసి కేటాయిస్తారు.

కాగా, గత కొంత కాలంగా కంప్యూటరైడ్జ్​ లాటర్​ సిస్టం​ను దుర్వినియోగ పరుస్తున్నారనే విషయం అమెరికా దృష్టికి వచ్చింది. కొన్ని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు వీసాలు దక్కే అవకాశాలను పెంచుకునేందుకు ఈ లాటరీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించింది. దీంతో హెచ్​-1 వీసాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆధునీకరించేందుకు అమెరికా ఫెడరల్ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొత్త వీసా నిబంధనలను తీసుకురావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+