Houthi: కంటెయినర్ షిప్‍పై మరోసారి దాడికి దిగిన హౌతి తీవ్రవాదులు..

ఎర్ర సముద్రంలో కంటైనర్ షిప్ లపై దాడులు కొనసాగుతోన్నాయి. యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాల నుంచి వచ్చిన చిన్న పడవలు కంటైనర్ షిప్ మెర్స్క్ హాంగ్‌జౌపై కాల్పులు జరిపాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఆదివారం తెలిపింది. హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన యాంటీ షిప్ మిస్సైల్‌తో సింగపూర్ జెండా, డెన్మార్క్ యాజమాన్యంలోని కంటైనర్ షిప్ కాస్త ధ్వంసం అయింది.

10 రోజుల క్రితం అంతర్జాతీయ సంకీర్ణ సేనలు ఎర్ర సముద్రంలో గస్తీ మొదలుపెట్టిన తర్వాత ఇది తొలి దాడి. మరో రెండు బాలిస్టిక్‌ క్షిపణులను అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ గ్రావ్‌లీ కూల్చివేసింది. హౌతీ-మద్దతుగల మిలీషియాకు చెందిన ఈ కార్యకర్తలు కంటైనర్ షిప్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారని US సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ సంఘటన ఉదయం 6:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) జరిగింది.

Houthi terrorists attacked the container ship once again

"కంటెయినర్ షిప్ Maersk Hangzhou నాలుగు ఇరానియన్-మద్దతుగల హౌతీ చిన్న పడవలు దాడికి గురైనట్లు నివేదించిన 24 గంటలలోపు రెండవ డిస్ట్రెస్ కాల్ జారీ చేసింది" అని యూఎస్ తెలిపింది. కంటైనర్ షిప్‌లోని భద్రతా బృందం తిరిగి కాల్పులు జరిపింది. ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపి నాలుగు చిన్న పడవల్లో మూడింటిని ముంచేశారు. నాల్గో పడవ ప్రాంతం నుంచి పారిపోయిందని, US సిబ్బంది లేదా పరికరాలకు ఎటువంటి నష్టం జరగలేదని పేర్కొంది.

ఒక అమెరికన్ డిస్ట్రాయర్ శనివారం యెమెన్ నుండి ప్రయోగించిన రెండు యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసింది. ఇజ్రాయెల్ తీవ్రవాద సంస్థ హమాస్‌తో పోరాడుతున్న గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా వారు చెబుతున్న దాడులతో కీలకమైన ఎర్ర సముద్రం షిప్పింగ్ లేన్‌లోని ఓడలను హౌతీలు పదేపదే లక్ష్యంగా చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+