వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్‌ మీద యుద్ధానికి రష్యాకు ఎంత ఖర్చవుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రష్యా క్షిపణి ప్రయోగం

ప్రణాళికకు అనుగుణంగా పనులు జరగని పక్షంలో యుద్ధాలు సులభంగా చేతులు దాటిపోతాయి.

వ్లాదిమీర్ పుతిన్ మనసులో ఏముందో తెలుసుకోవడం అసాధ్యమైనప్పటికీ, ఆయన ఫిబ్రవరి 24న యుక్రెయిన్ పై దాడి మొదలుపెట్టిన రెండు మూడు రోజుల్లోనే ఫలితాలను సాధించాలని ఆశించినట్లు చాలా మంది విశ్లేషకులు అంచనా వేశారు.

యుద్ధం మొదలై ఒక నెల రోజులు దాటింది. ప్రస్తుతానికి ఈ పోరాటం శత్రువును అణచివేసేందుకు అనేక స్థాయిల్లో జరుగుతున్న యుద్ధంగా మారింది. ఈ యుద్ధంలో రష్యా దారుణమైన వ్యూహాలను అమలు చేస్తోందని అమెరికా మిలిటరీ విశ్లేషకులు బెంజమిన్ జాన్సన్ , టైసన్ వెట్ జెల్ , జేబీ బరాంకో చెప్పారు.

వీరంతా కలిసి అట్లాంటిక్ కౌన్సిల్ కు ఒక వ్యాసం రాశారు. "రష్యా నెమ్మదిగా యుక్రెయిన్ లో యుద్ధ తీవ్రతను పెంచుతుందని అంచనా వేస్తున్నాం. యుక్రెయిన్ లో సరుకుల కొరతను సృష్టించి, నల్ల సముద్రానికి వెళ్లే మార్గానికి ఆటంకం కలిగించి, యుక్రెయిన్ రైతులు పంటలు పండించలేని పరిస్థితులను కల్పించి, కరువులోకి తోసేస్తుందని అంచనా వేస్తున్నాం.

అయితే, యుద్ధాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించడం రష్యాకు కూడా ఖర్చుతో కూడిన పనే. అయితే, రష్యాకు ఎంత ఖర్చవుతుంది? ఇది చాలా ఖరీదైన వ్యవహారం అని మాత్రం చెప్పవచ్చు.

రష్యన్ కరెన్సీ

"మిలిటరీ ఆపరేషన్లను కొనసాగించడం చాలా ఖరీదైన వ్యవహారం. ముఖ్యంగా సేనలు సొంత భూభాగానికి దూరంగా ఉండి పోరాడుతున్నప్పుడు" అని యూకే థింక్ ట్యాంక్ రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌యూఎస్ఐ) లో రీసెర్చ్ ఫెలో ఎడ్ ఆర్నాల్డ్ చెప్పారు.

"యుద్ధాన్ని కొనసాగించేందుకు అవసరమైన యుద్ధ సామాగ్రిని భారీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు సేనలకు కావల్సిన ఆహార పదార్ధాలను కూడా నిల్వ చేయాల్సి ఉంటుంది" అని అన్నారు.

యుక్రెయిన్ మీద రష్యా చేస్తున్న యుద్ధంలో అనేక లాజిస్టిక్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆధారాలున్నాయి. పనికిరాని చాలా రష్యన్ మిలిటరీ వాహనాలను యుద్ధ రంగంలో వదిలిపెట్టేశారు. "అయితే, యుక్రెయిన్ తో యుద్ధం కొన్ని రోజుల్లోనే ముగుస్తుందని భావించిన రష్యా ఈ పరిస్థితికి సిద్ధపడి ఉండదు" అని ఆర్నాల్డ్ అన్నారు.

"రష్యా దగ్గర ద్రవ్య నిల్వలు తగ్గుతుండటంతో ధరలు కూడా పెరుగుతున్నాయి" అని పదవీ విరమణ చేసిన అమెరికా నేవీ అడ్మిరల్, టఫ్ట్స్ యూనివర్సిటీలో డీన్ గా పని చేస్తున్న జేమ్స్ స్టావ్రిడిస్ వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలు (600 బిలియన్ డాలర్లు అంటే సుమారు 45.4 లక్షల కోట్ల రూపాయిలు). రష్యాలో ఉన్నప్పటికీ ఆర్ధిక ఆంక్షల కారణంగా పశ్చిమ దేశాల బ్యాంకులలో రష్యా డబ్బు లాక్ అయిపోయింది.

ఈ యుద్ధం వల్ల రష్యా పై పడే ఆర్ధిక భారమెంత?

యుక్రెయిన్ తో జరిగిన మొదటి 23 రోజుల యుద్ధం వల్ల రష్యాకు కనీసం 19.9 బిలియన్ డాలర్ల (రూ.1,49,250 కోట్లు) ఖర్చయి ఉంటుందని సెంటర్ ఫర్ ఎకనమిక్ రికవరీ, యుక్రెయిన్ ప్రభుత్వ సలహాదారులు, ఆర్థికవేత్తలు బృందం అంచనా వేసింది.

ధ్వంసం చేసిన మిలిటరీ సామగ్రి వల్ల క్రెమ్లిన్ కి కనీసం 9 బిలియన్ డాలర్ల (రూ. 67,500 కోట్లు) నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. దీంతో పాటు క్షిపణుల ప్రయోగానికి అయిన ఖర్చు, వచ్చే 40 ఏళ్లలో రష్యాకు రావల్సిన స్థూల జాతీయ ఉత్పత్తిని కూడా నష్టపోయిందని అన్నారు.

మార్చి 19 నాటికి యుద్ధంలో 14,400 మందికి పైగా సైనికులు మరణించినట్లు యుక్రెయిన్ తెలిపింది. ప్రజలను తరలించేందుకు అయిన ఖర్చు, గాయపడిన సైనికుల చికిత్స, యుద్ధ సామగ్రి కోసం పెట్టిన ఖర్చు, ఇంధనం, వాహనాల విడి భాగాలు, సైనికుల పోషణకైన ఖర్చును కూడా జత చేయాల్సి ఉంటుంది.

అయితే, ఈ ఖర్చుల గురించి ఎవరూ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి స్వరూపం గురించి అవగాహన ఉండటంతో బీబీసీతో మాట్లాడిన నిపుణులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. యుద్ధాన్ని కొనసాగించడం ఖరీదైన పని అని మాత్రమే నిపుణులు చెప్పారు.

రష్యా యుద్ధ వాహనాలు

రష్యా దగ్గర డబ్బులు ఎప్పుడు అయిపోతాయి?

పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం పై రష్యా దగ్గరున్న డబ్బు నిల్వలు ఎప్పుడు అయిపోతాయనేది ఆధారపడి ఉంటుంది. రష్యా గ్యాస్ దిగుమతులను నిషేధించడాన్ని యూరోప్ దేశాలు తట్టుకుని ఉండగలవా లేదా అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైన విషయం. ఇది చాలా పెద్ద సవాలు. యూరోపియన్ యూనియన్ కి అవసరమైన 40% సహజ వాయువు దిగుమతులను రష్యా సరఫరా చేస్తోంది.

రష్యన్ బ్యాంకులను స్విఫ్ట్ పేమెంట్ విధానాల నుంచి తొలగించడాన్ని మరింత విస్తృతం చేస్తారా లేదా అనే విషయం పై స్పష్టత లేకపోవడంతో విదేశీ మారక చెల్లింపులను స్వీకరించేందుకు పుతిన్ దగ్గర ప్రత్యామ్నాయం లేదు. అంతర్జాతీయ లావాదేవీలు చేసేందుకు స్విఫ్ట్ పేమెంట్ విధానాలను ఉపయోగిస్తారు.

రష్యా తన వనరులను ఎంత వరకు పెంచుకోగలదనేది దాని మిత్రదేశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చైనా పోషిస్తున్న పాత్రను విస్మరించడానికి లేదు.

పుతిన్, షీ జిన్ పింగ్

చైనా పాత్ర

ఈ యుద్ధాన్ని ప్రభావితం చేసేందుకు చైనాకున్న సామర్ధ్యం గురించి నిపుణులు మాట్లాడుతున్నారు. కానీ, చైనా ఈ యుద్ధంలో ఎటువంటి పాత్ర పోషిస్తుందనే అంశం పై ఏకాభిప్రాయం లేదు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి పై బీజింగ్ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, ఈ దాడిని చైనా కేవలం సైనిక చర్యగా మాత్రమే అభివర్ణిస్తోంది.

"పశ్చిమ దేశాలు రష్యా పై విధించిన ఆంక్షలు ఆగ్రహం తెప్పించేవిగా ఉన్నాయి" అని మార్చి 19న చైనా డెప్యూటీ ఫారిన్ మంత్రి లీ యూచెంగ్ అన్నారు. పశ్చిమ దేశాలు తీసుకున్న చర్యలు ఏకస్వామ్యంగా ఉన్నాయని ఇవి రష్యా పౌరులను ఎటువంటి కారణం లేకుండా విదేశీ ఆస్తులను ఉపయోగించుకోనివ్వకుండా ఆటంకం కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

"ఆంక్షలు సమస్యలను పరిష్కరించవని చరిత్ర ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. ఆంక్షలు సాధారణ ప్రజలకు హాని కలిగించి ఆర్ధిక వ్యవస్థ పై ప్రభావం చూపిస్తాయి. ఇవి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మరింత క్షీణింపజేస్తాయి" అని అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా రష్యాకు చైనా కీలకమైన దేశంగా ఉండవచ్చు" అని లాన్సస్టర్ యూనివర్సిటీలో లెక్చరర్ రెనాడ్ ఫౌకార్ట్ చెప్పారు.

ఆంక్షలను కొనసాగిస్తే ఒక్క చైనా, బెలారస్ తో తప్ప రష్యాకు మిగిలిన వ్యాపార భాగస్వాములతో ఉన్న సంబంధాలు తెగిపోతాయి" అని అన్నారాయన. "ఈ డిమాండ్ ను మరింత పెంచలేం" అని స్పెయిన్ లోని ఐఈ బిజినెస్ స్కూల్ లో ప్రొఫెసర్ మాక్సిం మిరోనోవ్ అన్నారు.

"చైనా రష్యా నుంచి వనరులను అతి చౌకగా కొనుక్కుని, ఉత్పత్తులను తిరిగి అధిక ధరలకు అమ్ముతుంది. చైనా రష్యాను వలస రాజ్యంగా చూడటం మొదలుపెడుతుంది. ఈ యుద్ధంలో అంతిమంగా చైనా విజేతగా నిలుస్తుంది" అని అన్నారు.

రష్యా ఆర్ధిక స్థితి బలహీనంగా ఉంది

ఆర్ధిక వ్యవస్థ బలహీనం

పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యా లాంటి పెద్ద దేశం పై ప్రభావం చూపించలేవని మాస్కో అంటోంది. రష్యా లాంటి పెద్ద దేశాన్ని ఏకాకిని చేయడం యూరోప్, అమెరికాకు కష్టమని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మార్చి 5 న విలేఖరులతో అన్నారు.

కానీ, రష్యా కరెన్సీ రూబుల్ విలువ మాత్రం బాగా పడిపోయింది. చాలా వరకు స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు ఆగిపోయాయి. ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. వడ్డీ రేట్లు రెట్టింపయ్యాయి. 400కు పైగా విదేశీ సంస్థలు దేశం విడిచి పెట్టి వెళ్లిపోయాయి. ఈ ఏడాది రష్యా ఆర్ధిక వ్యవస్థ 7% నుంచి 15% పడిపోతుందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.

రష్యా ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులను కూడా చెల్లించలేదని అంచనా వేస్తున్నారు. "రష్యా పరిశ్రమలు స్తంభించిపోయాయి" అని మిరోనోవ్ అన్నారు. రానున్న వారాల్లో పుతిన్ పై ఈ యుద్ధం భరించలేని ఆర్ధిక భారంగా మారుతుందో లేదోననేది ముఖ్యంగా రెండు అంశాలు నిర్ణయిస్తాయని ఫౌకార్ట్ అన్నారు.

పశ్చిమ దేశాల నుంచి సాంకేతిక సహాయం లేకుండా రష్యా మిలిటరీ, రక్షణ శాఖ మనుగడ సాగించగలవా అనేది ఒక అంశం అయితే, ప్రజాభిప్రాయాన్ని పుతిన్ కు వ్యతిరేకంగా మార్చేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలు సరిపోతాయా అనేది రెండవ అంశం అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How much is the war on Ukraine costing Russia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X