వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపై 43,200 సార్లు రేప్ జరిగింది: బాధితురాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

మెక్సికో: మనుషుల అక్రమ రవాణా వలలోంచి బయటపడిన ఓ బాధితురాలు దారుణమైన విషయాలను వెల్లడించింది. మెక్సికోలో మనుషుల అక్రమ రవాణా జరిపి సెక్స్ బానిసలుగా అమ్మేయడం సాధారణమైన విషయమే. ఆ వలలోంచి అనుకోకుండా బయటకు వచ్చిన ఓ యువతి తన ఆవేదనను బయటి ప్రపంచానికి వెల్లడించిదంి.

నాలుగేళ్ల పాటు ప్రతి రోజూ కనీసం 30 మంది తనపై అత్యాచారం చేసేవాళ్లని, ఇలా తాను దాదాపు 43,200 సార్లు అత్యాచారానికి గురయ్యానని ఆమె చెప్పింది. తాను 12 ఏళ్ల వయసులో ఉండగా ఖరీదైన బహుమతులు, బోలెడు డబ్బులు, విలాసవంతమైన కార్లు ఇస్తానని ఆశపెట్టి తనను వ్యభిచారంలోకి దించినట్లు ఆమె తెలిపింది.

 Human trafficking survivor: I was raped 43,200 times

మెక్సికోలోని టెనాన్సింగ్ పట్టణానికి ఆమెను తరలించారు. అది మనుషల అక్రమ రవాణాకు నిలయ. మూడు నెలల పాటు అక్కడే ఉన్నానని, తర్వాత తనను అక్కడి నుంచి మరో పెద్ద నగరానికి తరలించి అక్కడ బలవంతంగా వ్యభిచారంలోకి దించారని ఆమె తెలిపింది.

ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు ప్రతి రోజూ ఇదే పని అయ్యేదని, తాను ఏడుస్తుంటే నవ్వేవారని ఆమె తన హృదయవిరాకమైన పరిస్థితిని వివరించింది. ఓసారి ఓ విటుు తన మెడ మీద ముద్దు పెట్టినట్లు చూసి తనను ఆ వృత్తిలోకి దించిన వ్యక్తి చైన్ తీసుకుని కొట్టాడని చెప్పింది. ఇస్త్రీ పెట్టెతో వాతలు కూడా పెట్టాడని చెప్పింది.

మెక్సికోలో యేటా కనీసం 20 వేల మంది అమ్మాయిలు ఇలాంటి పరిస్థితిలో మగ్గుతున్నారు. ఆమెను మెక్సికో నగరంలో నిర్వహించిన యాంటీ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో రక్షించారు. ఇప్పుడామే ఈ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగతున్న పోరాటంలో అగ్రభాగాన నిలుస్తున్నారు.

English summary
woman who became coerced into Mexico's lucrative human trafficking industry has spoken out about her torment at the hands of the country's ruthless organized crime rings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X