‘ట్రంప్ ను దించేద్దాం.. వ్యతిరేక సమాచారం ఇస్తే రూ.65 కోట్లు బహుమతి’, కలకలం రేపిన ప్రకటన..

అమెరికాలో ఒక ప్రకటన కలకలం సృష్టిస్తోంది. ట్రంప్ ను అధ్యక్ష పదవినుంచి తొలగించేందుకు సహకరించాలంటూ వాషిగ్టన్ పోస్ట్ పత్రికలో ఓ సంచలన ప్రకటన ప్రచురితమైంది.

వాషింగ్టన్: అమెరికాలో ఒక ప్రకటన కలకలం సృష్టిస్తోంది. ట్రంప్ ను అధ్యక్ష పదవినుంచి తొలగించేందుకు సహకరించాలంటూ వాషిగ్టన్ పోస్ట్ పత్రికలో ఓ సంచలన ప్రకటన ప్రచురితమైంది.

ట్రంప్ పనితీరు, ఆయన వ్యవహార శైలి నచ్చని వారు, ఆయన అధ్యక్షుడైన తరువాత అమెరికాలో జరుగుతున్న జాత్యాహంకార దాడులు సహించలేని వారు ఇప్పుడు అమెరికాలో ఎంతోమంది ఉన్నారు.

Hustler Magazine founder takes out full-page ad offering $10 million for information that could lead to Trump's impeachment

ట్రంప్ ను దించేద్దామంటూ ప్రకటన ఇచ్చిన వ్యక్తి 'హస్లర్' మ్యాగజైన్ వ్యవస్థాపకుడు. ఆయన పేరు లారీ ఫ్లింట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పదవి నుంచి దించగలిగే సమాచారాన్ని అందిస్తే దాదాపు రూ.65కోట్లు (10 మిలియన్‌ డాలర్లు) బహుమతిగా ఇవ్వనున్నట్లు లారీ ఫ్లింట్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు.

'నేను ట్రంప్‌ దగ్గరున్న కోట్లాది రూపాయలను ఆశించడం లేదు. అతన్ని పదవి నుంచి తప్పించాలనుకుంటున్నాను. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. అధికారం చేపట్టిన 9 నెలల్లో అతడు అత్యున్నత పదవికి అర్హుడు కాదని నిరూపించుకున్నాడు..' అంటూ ఆ ప్రకటనలో లారీ ఫ్లింట్ వివరించాడు.

గతంలో ఇద్దరు రిపబ్లికన్‌ నేతల బండారాన్ని బయటపెట్టింది కూడా 'హస్లర్' మ్యాగజైన్ వ్యవస్థాపకుడు లారీ ఫ్లింటే. సంచలనం సృష్టించిన ఈ ప్రకటన ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+