బోనస్ కావాలంటే ఈ కండీషన్‌కు ఒప్పుకోవాల్సిందే...
బోనస్‌లు, ఇంక్రిమెంట్ల కోసం ఉద్యోగులు అహర్నిశలు కష్టపెడతుంటారు. ఎంత పనిచెప్పినా చేసేస్తుంటారు. కానీ, ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు ఏకంగా ఒక విచిత్రమైన కండీషన్ పెట్టింది. ఇంతకీ ఆ కండీషనేంటో తెలుసుకుందాం పదండి..
ఓ అంతర్జాతీయ మీడియా రిపోర్టు ప్రకారం.. గౌంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని డాంగ్పో పేపర్ కంపెనీ ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు ఓ విచిత్రమైన కండీషన్‌ను పెట్టింది. ఉద్యోగులు నెలలో 50 కిలోమీటర్లు పరిగెత్తితే వారికి పూర్తి బోనస్ అందిస్తామని పేర్కొంది. దీంతో ఉద్యోగులందరూ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పరుగులు పెడుతున్నారు. డాంగ్పో పేపర్ కంపెనీ ఉద్యోగుల్లో ఫిట్‌నెస్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గౌంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని డాంగ్పో పేపర్ కంపెనీ అక్కడ పనిచేసే ఎంప్లాయ్‌స్‌కు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంత పరిగెడితే అంత బోనస్ అని తెలిపింది. గతంలో ఉన్న యాన్యువల్ పర్ఫార్మెన్స్ బోనస్ పాలసీని తొలగించి తాజాగా నెలవారీ రివార్డ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ కండిషన్ కేవలం ఉద్యోగులను ఫిట్‌గా ఉంచడమే కోసమేనట. ప్రతి నెలా వారు పరిగెత్తే దూరాన్ని బట్టి వారికి బోనస్ ఇవ్వనున్నారట..
100 కిలోమీటర్లు పరిగెత్తినవారికి అదనంగా 30 శాతం బోనస్..
ఈ కండీషన్ ప్రకారం కంపెనీలో పనిచేసే ఉద్యోగులు నెలకు 50 కిలోమీటర్లు పరిగెత్తితే చాలు ఫుల్ బోనస్ లభిస్తుంది. 40 కిలోమీటర్లు పరుగెత్తిన వారికి 60 శాతం మాత్రమే బోనస్. 30 కిలోమీటర్ల వారికి 30 శాతం బోనస్ మాత్రమే లభిస్తుంది. దీంతో పాటు మరో ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. నెలలో 100 కిలోమీటర్లు పరిగెత్తినవారికి అదనంగా 30 శాతం బోనస్ ఉంటుందని ప్రకటించింది. మొత్తం 130 శాతం బోనస్. ఈ కండీషన్‌లో భాగంగా కేవలం రన్నింగ్ మాత్రమే కాదు.
ఉద్యోగులు ఇందులో స్పీడ్ వాకింగ్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఉద్యోగుల ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసిన యాప్ ద్వారా వారు నడిచిన, పరిగెత్తిన దూరాన్ని కంపెనీ లెక్కిస్తుందట. ఈ సరికొత్త ఆలోచనకు నాంది పలికింది మాత్రం గౌండాంగ్ డాంగ్పో పేపర్స్ ఛైర్మన్ లిన్ ఝింయాంగ్. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కంపెనీ ఎక్కువ కాలం నడుస్తుందని ఆయన నమ్మకం. అందుకే ఈ కండిషన్లు పెట్టారని కంపెనీ తెలిపింది.












Click it and Unblock the Notifications