ఇమ్రాన్ ఖాన్‌పై దాడి, అడ్డుకున్న వ్యక్తికి ప్రశంసలు.. అభిమానుల ఫిదా
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై హత్యా ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. గురువారం వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో దుండగుడు కాల్పులు జరపడంతో.. ఇమ్రాన్ కాలికి గాయమైంది. అయితే ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిపిన సమయంలో పట్టుకున్న వ్యక్తిని ఇమ్రాన్ మద్దతుదారులు అభినందించారు.
అతనిని వారు తమ భుజంపైకి ఎక్కించుకున్నారు. అభినందనలు తెలుపుతూ.. ముద్దు పెట్టుకున్నారు. ఆ దుండుగుడిని పట్టుకొని మంచి పనిచేశావు అని అన్నారు. అతను కాల్పులు జరపడం తాను చూశానని.. మరో రౌండ్ కాల్పులు చేయకుండా చూశానని తెలిపారు. ఆ వెంటనే అతను తుపాకీ వదిలేసి పారిపోయాడని.. అతనిని తాను పట్టుకున్నానని వివరించారు. అంతేకాదు.. తాను బతికున్నంత కాలం.. ఖాన్ సార్‌కి ఏమీ కానీవ్వను అని కామెంట్ చేశారు.

ఘటనను పాకిస్థాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఖండించారు. పాక్‌లో గల పంజాబ్ ఐజీ, సీఎస్ నుంచి నివేదిక కోరాలని ఇంటిరియర్ మినిస్టర్ రాణా సానాల్హాహ్‌ను ఆదేశించానని తెలిపారు. అక్టోబర్ 29వ తేదీ నుంచి లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ తీస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ కొనసాగింది. నవంబర్ 4వ తేదీన (రేపు) ర్యాలీ ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది. ఇంతలోనే దాడి జరిగింది.












Click it and Unblock the Notifications