వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం ఇస్లామిక్ ప్రపంచం ఏమనుకుంటోంది ?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి పోయింది. దానికి కొద్దిరోజుల ముందు నుంచీ అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. పాకిస్తాన్‌లో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన స్పందన వస్తోంది.

ఇస్లాంను భుజాన వేసుకునే ప్రయత్నాలకు ఆయన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చాలామంది చెబుతుండగా, సైన్యంతో విభేదాల కారణంగానే ఇమ్రాన్ పదవిని కోల్పోవాల్సి వచ్చిందని మరికొందరు అన్నారు.

ఏప్రిల్ 10, ఆదివారం అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో 174 మంది ఎంపీలు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతకు ముందు ఇమ్రాన్‌ ఖాన్‌ తన పదవిని నిలుపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయి.

తనను పదవి నుంచి తొలగించాలని అమెరికా కోరుకుంటోందని ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను అమెరికా తోసిపుచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రష్యా, చైనాలతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించారనీ, అందుకే ఇమ్రాన్ ఖాన్‌కు జో బైడెన్ ఫోన్ కూడా చేయలేదని పాక్ ఆరోపించింది.

https://twitter.com/SALHACHIMI/status/1513270693336604676

''సౌదీ అరేబియా, యూఏఈ, యూరప్‌లలోని రైట్ వింగ్‌లో ఇమ్రాన్ ఖాన్‌ పాపులారిటీ పెరగడం ఆనందంగా ఉంది. ఇస్లామిక్ ప్రపంచంలో ఇమ్రాన్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆయన ఇస్లాం రక్షకుడిగా ఉద్భవించారు'' అని 'ది ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్' డైరెక్టర్ సమీ హమ్దీ ఒక వీడియోను ట్వీట్ చేస్తూ వ్యాఖ్యానించారు.

అల్-అక్సా మసీదు ఇమామ్ షేక్ ఇక్రమ్ సబ్రీ కూడా ఇమ్రాన్ ఖాన్ ను పొగిడినట్లు రేడియో పాకిస్తాన్ వార్తలు వెల్లడించాయి. ఇమ్రాన్ ముస్లింల నాయకుడని, పాలస్తీనా సమస్యను గట్టిగా సమర్థించారనీ ఇమామ్ షేక్ ఇక్రమ్ సబ్రీ అన్నారు.

పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రి డాక్టర్ నూర్-ఉల్-హక్ ఖాద్రీ కూడా అల్-అక్సా మసీదు ఇమామ్‌ తో మాటల సందర్భంగా ఇమ్రాన్ ఖాన్‌ పై ప్రశంసలు కురిపించారు.

ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌లో, ఐక్యరాజ్య సమితిలో ఇమ్రాన్ ఖాన్ పాలస్తీనా సమస్యను లేవనెత్తారని ఇమామ్ చెప్పారు. ఇజ్రాయెల్‌ను పాకిస్తాన్ ఎప్పటికీ గుర్తించదని ఈ సంభాషణలో మంత్రి డాక్టర్ నూర్-ఉల్-హక్ ఖాద్రీ అన్నారు. అమెరికా చొరవతో 2020లో యూఏఈ, బహ్రెయిన్ లు ఇజ్రాయెల్‌ తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. దీనిపై పాక్‌లో నిరసన కూడా వ్యక్తమైంది.

ప్రత్యేక ఇస్లామిక్ సంస్థ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాల్లో ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేక స్థానం ఉందని, అతను ప్రవక్త పట్ల తన నిబద్ధతను బహిరంగంగా వ్యక్తం చేశారని అరబిక్ భాషకు చెందిన అల్మస్తకిలా టీవీ ఛైర్మన్ డాక్టర్ ముహమ్మద్ అల్-హకీమీ అల్-హమీది అన్నారు. ఇస్లామోఫోబియా గురించి ఇమ్రాన్ గొంతు వినిపించారని ఆయన చెప్పారు.

''ప్రత్యేక ముస్లిం ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయడం గురించి మాట్లాడడమే ఇమ్రాన్ ఖాన్ చేసిన తప్పు'' అని పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఎంపీ అలీ ముహమ్మద్ ఖాన్ ఏప్రిల్ 10న వ్యాఖ్యానించారు.

''ఆయన స్వతంత్ర విదేశాంగ విధానం గురించి మాట్లాడారు. ముస్లిం ఆర్గనైజేషన్ గురించి మాట్లాడారు. మదీనా రాజ్యం గురించి, ముస్లిం ఉమ్మా గురించి మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ చేసిన నేరం ఇదే'' అని ఆయన అన్నారు.

కొత్త ఇస్లామిక్ ఆర్గనైజేషన్ విషయంలో డిసెంబర్ 2019లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ల ఒత్తిడికి తలవంచవలసి వచ్చింది.

https://twitter.com/MALHACHIMI/status/1513242381830684673

డిసెంబర్ 19-20 తేదీల్లో మలేషియాలో జరిగిన కౌలాలంపూర్ సమ్మిట్‌లో పాకిస్తాన్ పాల్గొనలేదు. ఈ సమ్మిట్‌కు ఇమ్రాన్ ఖాన్ హాజరవుతారా లేదా అనే దానిపై అప్పట్లో చాలా ఉత్కంఠ నెలకొంది.

ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) తరహాలో ఇస్లామిక్ దేశాల ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఓఐసీ సంస్థ పై సౌదీ అరేబియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాలపై సౌదీ అరేబియా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి నిష్క్రమించడం డచ్ నాయకుడు గ్రీట్ వైల్డర్స్ ట్వీట్ చేశారు ''అధ్యక్షుడు, ఇస్లామిక్ తీవ్రవాది ఇమ్రాన్ ఖాన్ పదవిని వీడాల్సి వచ్చింది. అతను ఉగ్రవాదానికి మద్దతుదారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంతో పాటు భారతదేశానికి శత్రువు'' అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

అయితే, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి కాగా, గ్రీట్ వైల్డర్స్ ఆయన్ను దేశ అధ్యక్షుడు అని తన ట్వీట్ లో సంబోధించారు.

ఇమ్రాన్ ఖాన్

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దుర్వినియోగమా?

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ది డాన్' ఏప్రిల్ 11న ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకోవడంపై సంపాదకీయం రాసింది. '' ఈ మొత్తం సంక్షోభంలో ఇమ్రాన్ ఖాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తులను రాజకీయాల్లోకి లాగారు'' అని వ్యాఖ్యానించింది.

''ఒక రాయబారి పంపిన కేబుల్ సమాచారాన్ని ప్రస్తావించడం ద్వారా అమెరికాతో సంబంధాలను పోగొట్టుకున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. ఇమ్రాన్ ఖాన్ చాలా ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. లేఖలోని భాష పై జాతీయ భద్రతా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా వైపు నుంచి కుట్ర జరిగిందని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. కానీ, అందులో అలాంటిదేమీ లేదు'' అని డాన్ పత్రిక తన సంపాదకీయంలో రాసింది.

https://twitter.com/ImIqbalWazir/status/1512900893825507333

ఇమ్రాన్ ఖాన్

సైన్యంతో విభేదాలు

పెరుగుతున్న పాకిస్తాన్ ఆర్మీ అధికారుల సంపదపై పాకిస్తానీ జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ సెప్టెంబర్ 2020లో ఒక నివేదికను ప్రచురించారు.

ఈ నివేదిక తర్వాత, లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ సలీం బజ్వా (రిటైర్డ్) చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడారు. ''ఇమ్రాన్ ఖాన్ తనను తాను ప్రధాన మంత్రిగా భావించుకుంటున్నారు. కానీ ఆయన్ను సైన్యం తయారు చేసింది. మనల్నిఎవరైనా తయారు చేసినప్పుడు వారు చెప్పినట్లు వినాలి. ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కష్టమే'' అని ఆయన బీబీసీతో అన్నారు.

https://twitter.com/geertwilderspvv/status/1512896799027216385

ఇమ్రాన్, జెమీమా, డయాన

ఇమ్రాన్ ఖాన్ బంధువులు ఏమంటున్నారు?

లండన్‌కు చెందిన జెమీమా గోల్డ్‌స్మిత్‌ ఇమ్రాన్ ఖాన్ మొదటి భార్యగా చెబుతారు. జెమీమా సోదరుడు జాక్ గోల్డ్‌స్మిత్ యూకే ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు మద్దతుగా ఆయన ట్వీట్‌ చేశారు.

''పాకిస్తాన్‌లో గత రాత్రి జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇమ్రాన్ ఖాన్ మంచి వ్యక్తి. ప్రపంచంలో అవినీతికి పాల్పడే నేతలలో చివరి వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయం'' అని ట్వీట్ చేశారు.

https://twitter.com/ZacGoldsmith/status/1513030225508057090

https://twitter.com/BenGoldsmith/status/1512895635837661193

జెమీమా మరో సోదరుడు బెన్ గోల్డ్ స్మిత్ కూడా దీనిపై స్పందించారు. ''మా బావ ఇమ్రాన్ ఖాన్ గౌరవనీయమైన వ్యక్తి. తన దేశానికి చాలా చేయాలనుకున్నారు. ప్రధానమంత్రిగా ఆయన రికార్డు అద్భుతం'' అని ట్వీట్ చేశారు.

జెమీమా, ఇమ్రాన్ ఖాన్‌లు 1995లో లండన్‌లో వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Imran Khan's resignation as Prime Minister What does the Islamic world think
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X