న్యూస్‌ ఛానల్‌లో ప్రకంపనలు, లైవ్‌ షో నిలిపివేత, స్టూడియో సిబ్బంది పరుగో పరుగు

Posted By:
Subscribe to Oneindia Telugu

టెహ్రాన్‌ : ఇరాన్‌, ఇరాక్‌లను శక్తిమంతమైన భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపానికి 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలారు.

రెండు దేశాల సరిహద్దులో సంభవించిన భారీ భూప్రకంపనలతో వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ భూప్రకంపనల తీవ్రతను తెలిపే పలు దృశ్యాలు బయటకు వస్తున్నాయి.

ఇరాక్‌ లోని ఓ న్యూస్‌ ఛానల్‌లో లైవ్‌ ఇంటర్వ్యూ జరుగుతుండగా భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ఆ ప్రకంపనల ధాటిగా స్టూడియో అటుఇటు వూగడం, న్యూస్ ప్రెజెంటర్ కదలడం స్పష్టంగా కనిపించాయి.

దీంతో ఆ ఛానల్ వెంటనే లైవ్‌ కార్యక్రమాన్ని నిలిపివేసింది. భూకంపం సంభవించిన సమయంలో ఎర్బిల్‌లో రుడా న్యూస్‌ ఛానల్‌ ప్రెజెంటర్‌ సులేమానియా ప్రాంతంలోని ఓ రాజకీయనేతతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.

ఈశాన్య ప్రాంతాలైన ఈ రెండు నగరాల్లో అదే సమయంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాజకీయ నేత మాట్లాడుతుండగా స్టూడియో ఒక్కసారిగా షేక్‌ అయింది. దీంతో ఆ నేత కూడా భయంతో వణికిపోయాడు. వెంటనే స్టూడియోను వదిలి వెళ్లిపోయాడు.

ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్న న్యూస్‌ ప్రెజెంటర్‌ కూడా.. ఆ ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని.. అవి తమకు తెలుస్తూనే ఉన్నాయని లైవ్‌లో చెబుతూ.. తాము సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతున్నామని చెప్పి స్టూడియోను వదిలి వెళ్లిపోయాడు.

దీంతో ఆ లైవ్ కార్యక్రమాన్ని ఆ ఛానల్‌ అర్థాంతరంగా నిలిపివేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రుడా ఛానల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A live interview on an Iraqi TV channel was cut short when a 7.3 magnitude earthquake shook the Iran-Iraq border. The news presenter, based in Erbil, was interviewing a politician from Sulaimaniyah, both in the country's northeast, when they started feeling the initial tremors. As the studio started shaking, the guest looked visibly nervous. "I feel there is an earthquake happening in Sulaimaniyah?" a concerned anchor asked the guest, as per a translation by The Guardian. The panicked guest soon abandoned his seat and left. "There is also an earthquake here, I can feel it. It's too strong, without a doubt," the news presenter announced.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి