షాకింగ్: పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ -చైనాలో 41ఏళ్ల వ్యక్తికి H10N3 స్ట్రెయిన్- ప్రపంచంలోనే తొలిసారి

డ్రాగన్ దేశం చైనాలో మరోసారి వైరస్ సంబంధిత తొలి కేసు వెలుగులోకి వచ్చింది. పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ మనుషులకూ సోకడం అరుదుగా జరిగే అయినా, ఆ జీవలపాలిట అత్యంత ప్రమాదకారి అయిన హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ తొలిసారి మనుషికి సోకిన ఉదంతం ప్రపంచంలో ఇదే తొలిసారి. అప్పటికే కరోనా వైరస్ పుట్టుకపై నిజాల్ని దాచిపెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా .. బర్డ్ ఫ్లూ హెచ్‌10ఎన్‌3 రకంపై రోజుల గ్యాప్ తర్వాత అరకొరగా అధికారిక ప్రకటన చేసింది..

Recommended Video

    H10N3 Bird Flu - First Human Case In China | Oneindia Telugu

    చైనాలో తొలిసారిగా బర్డ్‌ ఫ్లూ సంబంధిత హెచ్‌10ఎన్‌3 వేరియంట్ ఓ వ్యక్తికి సోకినట్లు ఆ దేశ ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. మొన్న ఏప్రిల్ నుంచి ఈశాన్య చైనాలో హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ పక్షులకు పెద్ద ఎత్తున వ్యాపించగా, ఇప్పుడా రకం మనుషులకూ వ్యాపించడం మొదలైంది. తొలి H10N3 స్టరెయిన్ గుర్తింపు తర్వాత అప్రమత్తమయ్యామని ఎన్‌హెచ్‌సీ పేర్కొంది.

    In worlds first case, China reports human getting infected with H10N3 bird flu

    ప్రపంచంలోనే తొలిసారిగా బర్డ్‌ ఫ్లూ హెచ్‌10ఎన్‌3 రకం కేసు తమ దేశంలోనే వెలుగులోకి వచ్చినట్లు అంగీకరించిన హెల్త్ కమిషన్.. ఆ రోగిని జెన్‌జియాంగ్‌ ప్రావిన్స్ కు చెందిన 41 ఏళ్ల వ్యక్తిగా మాత్రమే పేర్కొంది తప్ప.. అతనికి బర్డ్ ఫ్లూ ఎలా సోకింది, ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు తదితర వివరాలేవీ వెల్లడించలేదు. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) రక్త పరీక్షలు చేయగా అతడికి బర్డ్‌ ఫ్లూ హెచ్‌10ఎన్‌3 సోకిందని మే 28 న వెలువడిన ఫలితాల్లో నిర్ధారణ అయ్యిందని మాత్రమే పేర్కొంది.

    పక్షుల పాలిట అతి ప్రమాదకరమైన హెచ్‌10ఎన్‌3 రకం బర్డ్‌ ఫ్లూ మనుషిలోనూ గుర్తించడంతో అప్రమత్తమైన చైనీస్ వైద్యారోగ్య శాఖ అధికారులు రోగికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అతతని ట్రావెల్ డేటాను కూపీలాగి, ఫ్లూ సోకిన తర్వాత అతను ఎవరెవరిని కలిశారో వాళ్లనూ ట్రేస్ చేసి టెస్టులు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతానికి బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉందని, హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్ కు గురైన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ స్పష్టం చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+