కన్న కూతురితోనే కొడుకును కన్నాడు: అనుమానంతో మరో దారుణం..

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: కన్న కూతురినే వివాహం చేసుకుని.. ఆమెతో కొడుకును కన్నాడో తండ్రి. ఆపై కూతురి మీద అనుమానం పెంచుకుని.. ఆమెతో పాటు కొడుకును కూడా చంపేశాడు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఈ దారుణం వెలుగుచూసింది.

స్థానిక మీడియా ప్రకారం.. నార్త్‌ కరోలినాకు చెందిన స్టీవెన్‌ ప్లాదల్‌(42) తన కూతురు క్యాటీ(20)ని చిన్నతనంలోనే న్యూయార్క్‌కు చెందిన ఆంటోనీ ఫస్కో అనే వ్యక్తికి దత్తత ఇచ్చాడు.

 Incest case dad, daughter and child dead in murder-suicide

క్యాటీకి 18ఏళ్ల వయసు వచ్చిన తర్వాత తన కన్న తల్లిదండ్రులతో మళ్లీ ఆమె టచ్ లోకి వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని తండ్రి స్టీవెన్ ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. క్రమంగా ఇద్దరి మధ్య శారీరకంగా సంబంధం కూడా మొదలైంది.

ఇదే క్రమంలో ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు స్టీవెన్. వావి వరుసల్లేని ఈ పెళ్లిపై అప్పట్లో అతనిపై కేసు కూడా నమోదై జైలుకు కూడా వెళ్లొచ్చాడు. గత మార్చిలో విడుదలైన అతను.. మళ్లీ కూతురికి దగ్గరయ్యాడు.

అయితే ఆమె మరొకరికి దగ్గరవుతుందన్న అనుమానం అతనిలో బలపడింది. బుధవారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. కొడుకు బెన్నెట్‌ను స్టీవెన్‌ చంపేశాడు. అనంతరం క్యాటీ, ఆమె పెంపుడు తండ్రి ఆంటోనీని ఓ ట్రక్కులో కొంత దూరం తీసుకెళ్లి కాల్చి చంపాడు.

హత్యల అనంతరం తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూమిల్‌ఫోర్డ్‌ సమీపంలోని ఓ ట్రక్కులో క్యాటీ, ఫ్లాదల్ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. స్టీవెన్ మృతదేహాన్ని లిట్చ్‌ఫీల్డ్‌ కౌంటీలో స్వాధీనపరుచుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A US man in an incest case has reportedly killed his biological daughter, their child, and the girl's adopted father, before killing himself.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X