వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా వ్యతిరేక ఓటింగ్ కు భారత్ దూరం - అనుకూలం 141 దేశాలు : తటస్థ వైఖరితో ముందుకు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

రష్యా - ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై తటస్థంగా వ్యవహరిస్తున్న భారత్.. ఎవరికీ ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం లేదు. ఇరుపక్షాలు శాంతియుత మార్గాన్ని పాటించాలని కోరుతోంది. ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్​కు భారత్ మరోసారి దూరమైంది. రష్యాకు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్​లో 141 దేశాలు మద్దతు పలికాయి. 5 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ సహా 35 దేశాలు ఓటింగ్​కు పూర్తిగా దూరంగా ఉన్నాయి.

భారత్ తటస్థ వైఖరి

భారత్ తటస్థ వైఖరి


ఐక్యరాజ్య సమితిలో తొలి నుంచి ఒకటే వైఖరితో ఉన్న భారత్ ఓటు వేసేందుకు దూరంగా ఉంటోంది. ఇటీవల ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై ఓటింగ్​కూ భారత్ దూరంగానే ఉంది. అదే సమయంలో భారత్ తాము చర్చల ద్వారానే పరిష్కారం కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. యుద్దం ద్వారా కాకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ లో రష్యా దాడులు తీవ్రమయ్యాయి. ఒక వైపు చర్చల పేరుతో ప్రతిపాదనలు చేస్తున్నా.. మరో వైపు రష్యా భద్రతా దళాలు ఏ మాత్రం తగ్గటం లేదు. అదే స్థాయిలో ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది.

పుతిన్ తో మట్లాడిన మోదీ

పుతిన్ తో మట్లాడిన మోదీ


ఇక, ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే కార్యచరణనను కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మరోసారి మాట్లాడారు. ఆరు రోజులుగా రష్యా-ఉక్రెయిన్​ మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో పుతిన్​తో మోదీ మాట్లాడటం ఇది రెండోసారి. ఖార్కివ్‌లో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన పరిస్థితిపై పుతిన్​తో చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సంఘర్షణ ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించడంపై పుతిన్​తో మోదీ మాట్లాడినట్లు చెప్పింది. రష్యా కీలక ప్రకటనయుద్ధంలో తమ సైనికుల మృతిపై తొలిసారి రష్యా ప్రకటన చేసింది.

సైనికుల మరణాలపై ప్రకటనలు

సైనికుల మరణాలపై ప్రకటనలు


ఉక్రెయిన్‌పై దాడుల ఘటనలో 498 మంది సైనికులు మరణించినట్లు ఆ దేశ రక్షణశాఖ తెలిపింది. మరో 1,597 మంది గాయపడ్డారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే యుద్ధంలో భారీ సంఖ్యలో రష్యన్​ సైనికులు చనిపోయినట్లు వస్తున్న వార్తల తోసిపుచ్చారు రష్యా సైన్యాధికారి మేజర్​ జనరల్​ ఇగోర్​ కోనాషెంకోవ్​. ఈ క్రమంలోనే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు 2,870 మందికిపైగా ఉక్రెయిన్​ సైనికులు మరణించారని.. 3,700 మందికిపైగా గాయపడ్డారని కోనాషెంకోవ్​ తెలిపారు. 572 మంది ఇతరులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

భారతీయులను తిరిగి రప్పించేందుకు

భారతీయులను తిరిగి రప్పించేందుకు


అయితే దీనిని ఉక్రెయిన్​ ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, సైనిక విమానాల ద్వారా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లారు. అక్కడ నుంచి ఆపరేషన్ గంగ పర్యవేక్షిస్తున్నారు. ఇటు..ప్రధాని మోదీ సైతం రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం ..భారతీయలు రక్షణ పైన ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు.

English summary
India continued to maintain its neutral stance as it again abstained from voting against Russia on a UN General Assembly resolution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X