Ukraine Russia War: ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై తన వైఖరిని స్ఫష్టం చేసిన భారత్.. మరోసారి ఓటింగ్‍కు దూరం..
ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలని ప్రవేశ పెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. శాంతికి దౌత్యం మాత్రమే ఆచరణీయమైన మార్గమని పేర్కొంది. ఉక్రెయిన్‌లో శత్రుత్వానికి ముగింపు పలకాలని, తన బలగాలను ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మాన ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. కాగా "చారిత్రక ఓటింగ్"లో, తీర్మానానికి అనుకూలంగా 141 మంది ఓటు వేశారు. భారత్, చైనా సహా 32 దేశాలు ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. ఏడు దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతిని చేరుకోవాలని అసెంబ్లీ మాస్కోను కోరింది.

దౌత్యం మాత్రమే
193 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీ ఉక్రెయిన్, దాని మద్దతు దేశాలు ఈ ముసాయిదా తీర్మానాన్ని తీసుకొచ్చాయి. "భారత్ బహుపాక్షికతకు స్థిరంగా కట్టుబడి ఉంది. UN చార్టర్ యొక్క సూత్రాలను సమర్థిస్తుంది. మేము ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యం మాత్రమే ఆచరణీయమైన మార్గంగా భావిస్తాం. ఈ రోజు తీర్మానం పేర్కొన్న లక్ష్యాన్ని మేము గమనించాము, అయితే మన లక్ష్యాన్ని చేరుకోవడంలో దాని స్వాభావిక పరిమితులను పరిగణనలోకి తీసుకుంటాము. శాశ్వత శాంతిని సాధించాలనే లక్ష్యంతో మేము దూరంగా ఉండవలసి ఉంటుంది" అని భారత ప్రథినిధి కాంబోజ్ చెప్పారు.

ఆర్థిక సహాయం
"మానవుల ప్రాణాలను పణంగా పెట్టి ఎటువంటి పరిష్కారమూ రాదని మేము నిరంతరం వాదిస్తున్నాము. ఈ నేపథ్యంలో ఇది యుద్ధ యుగం కాదన్న మన ప్రధాని ప్రకటన పునరుద్ఘాటిస్తుంది. శత్రుత్వం, హింసను పెంచడం ఎవరికీ ప్రయోజనం కలిగించదు" అని చెప్పారు.సాయుధ పోరాటాల పరిస్థితులలో పౌరులు, పౌర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా ఉండకుండా చూసేందుకు అంతర్జాతీయ సూత్రాలు,న్యాయశాస్త్రం సంఘర్షణలో పక్షాలపై బాధ్యత వహిస్తుందని కాంబోజ్ తెలిపారు. ఉక్రెయిన్ వివాదానికి సంబంధించి భారతదేశం అనుసరిస్తున్న విధానం ప్రజల కేంద్రంగా కొనసాగుతుందని ఆమె అన్నారు. భారతదేశం ఉక్రెయిన్‌కు మానవతా సహాయం, గ్లోబల్ సౌత్‌లోని పొరుగువారిలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కొందరికి ఆర్థిక సహాయం రెండింటినీ అందిస్తోందన్నారు.

ఆండ్రీ యెర్మాక్
ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్, భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుతో ఐక్యరాజ్యసమితి తీర్మానం గురించి మంగళవారం మాట్లాడారు. తమ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కానీ భారత్ జాతీయ ప్రయోజనల దృష్ట్యా ఈ ఓటింగ్ కు దూరంగా ఉంది. భారత్, రష్యాకు ఎప్పటి నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ప్రవేశవెట్టిన తీర్మానానికి కూడా భారత్ దూరంగా ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications