వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా సరిహద్దుల్లో ఆర్మీ మోహరింపు, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

కిబిథు: చైనా సరిహద్దుతో పాటు అరుణాచల్‌ప్రదేశ్ సెక్టార్‌లోని పలు ప్రాంతాల్లో భారత్ తన బలగాల సంఖ్యను మరింత పెంచింది. చైనా సరిహద్దు వెంట దిబాంగ్, డియో- డిలాయ్, లోహిత్ తదితర ప్రాంతాల్లో ఆర్మీ పహరా సాగుతోంది.

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ప్రకటించిన తర్వాత చైనా సరిహద్దుల్లో ఆర్మీని మోహరించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

 India increases troops along China border near Tibetan region

ప్రస్తుతమున్న ఆర్మీకి తోడుగా అదనపు సిబ్బంది చైనా సరిహద్దులకు తరలిస్తున్నారు. డోక్లామ్ వద్ద కూడ భారత్ తన బలగాలను పెంచింది. డోక్లామ్‌కు అవతలివైపున చైనా సరిహద్దులో ఆ దేశం భారీగా నిర్మాణాలను చేపడుతోంది అయితే భారత్ లో కూడ ఆర్మీని గతంలో కంటె ఎక్కువగా మోహరించింది.

వాస్తవాధీన రేఖ వద్ద లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ ను 15 నుండి 30 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు అధికారులు. అంతేకాదు భారత్, చైనా , మయన్మార్ ట్రై జంక్షన్‌తో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో బలగాలను విస్తరించినట్టు ఆర్మీ అదికారులు ప్రకటించారు. కిబిథు ప్రాంతానికి ఆర్మీకి అవసరమైన సామాగ్రిని తరలించేందుకు తాత్కాలికంగా వంతెనను నిర్మించారు.

English summary
India has deployed more troops and significantly increased patrolling in the mountainous terrains of Dibang, Dau-Delai and Lohit valleys along the China border in the Tibetan region of Arunachal Pradesh sector following the Doklam standoff, the most tense military confrontations between the two countries in decades
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X