వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘భారత్‌లో పేదరికం తక్కువ: పేదలే ఎక్కువ’: డబ్ల్యూబి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారతదేశంలో పేదరికం చాలా వరకు తగ్గిపోయిందని, అయితే దేశంలో పేద ప్రజలే ఎక్కువ ఉన్నారని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఈ క్రమంలో 2012లో చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాలలో కన్నా ఇండియాలో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు.

మిగతా దేశాలతో పోలిస్తే పేదరికం రేటు బాగా తక్కువ ఉందని ఉద్ఘాటించింది. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం.. పేదరికం రేటు భారత్‌లో గణనీయంగా తగ్గుతుందని ప్రకటించింది. 2015లో ప్రపంచ జనాభాలో పేదరికం 10శాతం తగ్గిపోయిందని తెలిపింది.

India's poverty rate lowest among nations with poor population: World Bank

2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ ఎంతో కృషి చేస్తోందని తెలిపింది. అల్పాదాయ దేశాల్లో పేదరికం రేటు 43 శాతం, మధ్యాదాయ దేశాల్లో 19 శాతం ఉందని పేర్కొంది.

2012లో అల్పాదాయ దేశాలుగా ఉన్న చైనా, భారత్, ఇండోనేషియా, నైజీరియాలు 2015లో దిగువ మధ్యాదాయ దేశాల జాబితాలో చేరాయని వెల్లడించింది. ప్రపంచంలో పేదరికం నిర్మూలన దిశగా అన్ని దేశాలు ప్రయత్నించడం అభినందించదగ్గ విషయమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ తెలిపారు.

English summary
India accounted for the largest number of poor people in any country in 2012, but its poverty rate was lowest among countries having large number of poor population, a latest World Bank report has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X