వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ కు యూఎస్ F16 ఫైటర్స్- భగ్గుమన్న భారత్ -మమ్మల్ని ఫూల్స్ చేయలేరన్న జైశంకర్ ..

|
Google Oneindia TeluguNews

భారత ఉపఖండంలోని దేశాలతో వ్యాపారం పేరిట తమ అవసరాలు తీర్చుకుంటున్న యూఎస్ ద్వంద వైఖరి మరోసారి బయటపడింది. ఓవైపు తీవ్రవాద దేశమంటూనే పాకిస్తాన్ కు ఎఫ్ 16 యుద్ధ విమానాలు అమ్మేందుకు యూఎస్ కుదుర్చుకున్న డీల్ కలకలం రేపుతోంది. దీనిపై భారత్ బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేసింది.

వాషింగ్టన్ లో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా-పాకిస్తాన్ సంబంధాల వెనుక ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇస్లామాబాద్‌తో వాషింగ్టన్ సంబంధాలు "అమెరికన్ ప్రయోజనాలకు" ఉపయోగపడబోవని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం వాషింగ్టన్‌లో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, "ఇది పాకిస్తాన్‌ కు లేదా అమెరికా కు ప్రయోజనమా కాదా అన్నది ముఖ్యం కాదన్నారు.

india strongly objected US-PAK F16 deal, jaishankar says not fooling anymore..

పాకిస్థాన్‌తో ఎఫ్-16 యుద్ధ విమానాలపై అమెరికా నిర్ణయంపై జైశంకర్ ను ప్రశ్నించగా.. ఆయన ఇలా స్పందించారు. కొద్ది వారాల క్రితం.. 2018 నుండి మొదటిసారిగా యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ 450 మిలియన్ల యూఎస్ డాలర్ల వ్యయంతో పాకిస్తాన్ వైమానిక దళం F-16 ఫ్లీట్, పరికరాల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్ ను ఆమోదించింది.

పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 నౌకాదళానికి జీవనోపాధి ప్యాకేజీని అందించాలన్న వాషింగ్టన్ నిర్ణయంపై భారత్ ఆందోళనలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు తెలిపారు. "ఈ బంధం యొక్క యోగ్యతలను, దాని ద్వారా వారు పొందే ప్రయోజనాలను ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని జైశంకర్ తాజాగా ప్రస్తావించారు. ఈ డీల్ వెనుక ఉన్న ఉద్దేశాలు అందరికీ తెలుసని, ఇందులో మమ్మల్ని ఎవరూ మోసం చేయలేరని జైశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి కొన్న ఎఫ్ 16 జెట్లు పాకిస్తాన్ ఎక్కడ మోహరిస్తుందో అందరికీ తెలుసన్నారు.

English summary
india has strongly objected F16 fighter jets supply deal between US and pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X