సంక్షోభం అంచులో పాకిస్థాన్ .. 12 లక్షల మంది రైతుల వలసలు.. 80 శాతం నీరు కోల్పోయి.. !

భారత్ సరిహద్దు దేశం పాకిస్థాన్ లో సంక్షోభం తలెత్తుతోంది. పాకిస్థాన్ లోని ఇండస్ డెల్టా ప్రాంతంలోకి ఉప్పు నీరు భారీగా చేరడం కారణంగా అక్కడి ప్రజల జీవన వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఉప్పు నీరు కారణంగా ఇండస్ డెల్టా ప్రాంతంలో పంటలు పండటం లేదు. చేపల పెంపకం నిలిచిపోవడంతో మత్య్స కార్మికులు తమ అస్తిత్వాన్ని కోల్పోయారు. ఖారో చాన్ పట్టణం జనాభా 1981 లో 21 వేలు ఉండగా 2023 నాటికి ఆ జనాభా 11 వేలకు తగ్గిపోయింది. సముద్రంలోని నీటిమట్టం పెరగడంతోనే అక్కడి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నట్లు తేలింది. ఇండస్ డెల్టాలో నీరులో లవణీయత 70 శాతం పెరిగింది. దీంతో అక్కడి పంటలు దెబ్బతినడంతో పాటు మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం పడింది.

పాకిస్థాన్ కు దక్షిణభాగంలో సింధూ నది, అరేబియా సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ ప్రాంతంలోని నీటిలో ఉప్పు శాతం అధికంగా పెరిగిపోయింది. 80 శాతం తాగునీటిలో లవణీయత పెరిగిపోయి తాగేందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో తీర ప్రాంతంలో పంటలు, మత్స్య సంపద పూర్తిగా దెబ్బతిన్నది. సింధూ నది.. అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో ఖారో చాన్ అనే పట్టణం ఉంది. ఈ పట్టణం చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు తాగు నీరు దొరికే పరిస్థితి లేదు. సాగు నీరు కూడా లభ్యం కాదు. మొత్తం ఉప్పు నీరు మాత్రమే. దీంతో ఒకప్పుడు 40 గ్రామాలు ఉండే ఆ ప్రాంతంలో ఇప్పుడు ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు.

అలా గత 2 దశాబ్దాలుగా దాదాపు 12 లక్షల మందికి పైగా ప్రజలు సింధూ నది డెల్టా నుంచి వలస వెళ్లిపోయారు. పాకిస్థాన్ లోని దాదాపు 80 శాతం మందికి సింధూ నదే జీవనాధారం. అక్కడి సాగు, తాగు నీటికి ఈ నది ఆధారంగా ఉంది. అయితే సింధూ నది సముద్రంలో కలిసే ప్రాంతంలో గతంలో వ్యవసాయం, మ్యాన్ గ్రూవ్, మత్య సంపద అధికంగా ఉండేది. కానీ ఉప్పు నీరు పెరగడంతో ఇప్పుడు పూర్తి భిన్నంగా మారింది. ఉప్పు నీరు క్రమంగా విస్తరిస్తున్న కారణంగా దాదాపు 17 శాతానికి పైగా సాగు భూమి ఇప్పుడు సాంద్రత కోల్పోయింది. పంటలు పండటం లేదు. ఈ విషయాన్ని 2019 నాటికి అక్కడి ప్రభుత్వం గుర్తించింది.

Indus Delta in Crisis Seawater Inflow Displaces 1 2 Million Farmers

మరోవైపు సింధూ నది పరీవాహక ప్రాంతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి కలిసి లివింగ్ ఇండస్ ఇనిషియేటివ్‌ ను అనే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ద్వారా నేల లవణీయతను తగ్గించడం, మడ అడవులను పునరుద్ధరించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ అడవులు ఉప్పునీరు బయటకు వచ్చి ఇతర జలాశయాల్లో కలిసిపోకుండా సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+